ఐరాస లో భారత శాశ్వత ప్రతినిధిగా ఆరీంధమ్ బాగ్చీ

హైదరాబాద్ (అక్టోబర్ – 17) : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ స్థానంలో ఆరీంధమ్ భాగ్చీ (Arindham Bagchi is India’s ambassador to UN in Geneva) త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన వెలువరించింది.

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంబోజ్ స్థానంలో త్వరలో స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆరీంధమ్ బాగ్చి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆరీంధమ్ బాగ్చి 1995 ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇంతకుముందు క్రోయేషియా దేశంలో భారత రాయబారిగా, శ్రీలంక దేశంలో డిప్యూటీ హైకమిషనర్ గా, భారత ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు.