BIKKI NEWS (FEB. 11) : తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో 20 మీ సేవా కేంద్రాల ఏర్పాటు చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ (applications for mee seva centers) ప్రకటన విడుదల చేశారు.
అర్హతలు :
గ్రామ పంచాయతీకి స్థానికుడై ఉండాలి.
వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
కనీస విద్యార్హతగా డిగ్రీ లేదా తత్ సమానమైన కోర్సు చేసి ఉండాలి.
కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలి.
దరఖాస్తుదారుడు మీసేవ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై రాత పరీక్ష (90 మార్కులు) మరియు ఇంటర్వ్యూ (5 మార్కులు), విద్యార్హత (5 మార్కులు) ఆధారంగా ఎంపిక చేయబడును.
అర్హత, ఆసక్తి కలిగిన స్థానిక అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ లోపు స్థానిక కలెక్టర్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ సేవా కేంద్రాలు – కేతన్ పల్లి, కిస్టాపూర్, గోటూర్, గుండ్మాల్, కొత్తపల్లి, మద్దూరు, మక్తల్, చిత్యల్, కన్మనుర్, కోటకొండ, నారాయణపేట, అభంగల్, చిన్న జెట్రం, అప్పక్కపల్లి, మగానూర్, కున్సీ, పతర్చేడ్, ఉందెకోడ్ యంకి, బిజ్వర్.