BIKKI NEWS (FEB. 11) : ICC U19 CRICKET WORLD CUP 2024 WON BY AUSTRALIA – యంగ్ ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగుతున్న అండర్ 19 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2024 విజేతగా యువ ఆస్ట్రేలియా జట్టు నిలిచింది.
ఫైనల్ మ్యాచ్ లో సిరీస్ లో ఓటమి ఎరుగని భారతజట్టు ను 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాదించి భారత ఆశలపై నీళ్లు చల్లింది.
254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాట్స్ మ్యాన్ ఘోరంగా విఫలమవడంతో 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఆదర్శ్ సింగ్ – 47, మురుగన్ అభిషేక్ – 42 పరుగులతో రాణించారు. బియర్ఢ్మన్ – 3, మెక్ మిలాన్ – 3, విడ్లర్ – 2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని 253/7 పరుగులను భారత్ కు లక్ష్యంగా విధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ లలో హర్జాస్ సింగ్ – 55, వీబ్జెన్ – 48, పీక్ – 46 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో లింబానీ – 3, తివారీ – 2 వికెట్లు తీశారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి