AP DSC NOTIFICATION CANCELLED – డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

BIKKI NEWS (JUNE 30) : AP DSC NOTIFICATION 2024 CANCELLED. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ఫిబ్రవరి లో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

AP DSC NOTIFICATION 2024 CANCELLED

అయితే ప్రస్తుత ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల సంఖ్యను 6100 నుండి 16, 347 పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నూతన నోటిఫికేషన్ జారీ చేయాలని భావించిన ప్రభుత్వం గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీకి ఆదేశాలు జారీ చేసింది.

డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ను కూడా నూతన ప్రభుత్వం జారీ చేయనున్నట్లు సమాచారం. ఈరోజు లేదా రేపు డీఎస్సీ నోటిఫికేషన్ మరియు టెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు

SGT – 6,371
SCHOOL ASSISTANT – 7,725
TGT – 1,781
PGT – 286
PET – 132
PRINCIPAL – 52

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు