హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 143 మంది అంగన్ వాడీ సూపర్ వైజర్ల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు (anganwadi supervisors regularization) జారీచేసింది.
ఒప్పంద విధానంలో కొనసాగుతున్న వారిని శిశు సంక్షేమ శాఖలో విస్తరణ అధికారులు (సూపర్వైజర్లు)గా గ్రేడ్ – 3 పోస్టుల్లో నియమించింది. ఈ మేరకు శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత సంక్షేమ శాఖల్లో తొలి క్రమబద్ధీకరణ జరిగిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి కావవడంతో రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లతో భర్తీ చేయనున్న సూపర్ వైజర్ల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ పోస్టులకు ఇప్పటికే పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మెరిట్ లిస్టులను సిద్ధం చేస్తోంది.