Home > TODAY IN HISTORY > WORLD DIABETES DAY : ప్రపంచ మధుమేహ దినోత్సవం

WORLD DIABETES DAY : ప్రపంచ మధుమేహ దినోత్సవం

BIKKI NEWS (NOV – 14) : ప్రపంచ మధుమేహ దినోత్సవం (WORLD DIABETES DAY NOVEMBER 14th) ప్రతి సంవత్సరం నవంబరు 14న నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణకోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.

WORLD DIABETES DAY NOVEMBER 14th

World diabetes day 2024 theme is. “Breaking Barriers, Bridging Gaps

World diabetes day 2023 theme is “EDUCATION TO PROTECT TOMORROW”

ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ ల మంది జనాభాకు డయాబెటిస్ ఉన్నట్లు ప్రపంచ డయాబెటిక్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి పది మంది లో ఒక్కరికీ డయాబెటిస్ ఉంది. అయితే చాలా మందికి తమకు డయాబెటిస్ ఉంది అని తెలియకపోవడమే ఈ వ్యాధి తీవ్ర ప్రభావాలకు కారణం.

ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ (డయాబెటిస్) వ్యాధి తొమ్మిదవ స్థానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడంవల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి నియంత్రణకు కావలసిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922లో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు