BIKKI NEWS (NOV – 14) : ప్రపంచ మధుమేహ దినోత్సవం (WORLD DIABETES DAY) ప్రతి సంవత్సరం నవంబరు 14న నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి నియంత్రణకోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.
World diabetes day 2023 theme is “EDUCATION TO PROTECT TOMORROW”
ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ ల మంది జనాభాకు డయాబెటిస్ ఉన్నట్లు ప్రపంచ డయాబెటిక్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి పది మంది లో ఒక్కరికీ డయాబెటిస్ ఉంది. అయితే చాలా మందికి తమకు డయాబెటిస్ ఉంది అని తెలియకపోవడమే ఈ వ్యాధి తీవ్ర ప్రభావాలకు కారణం.
ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో మధుమేహ (డయాబెటిస్) వ్యాధి తొమ్మిదవ స్థానంలో ఉంది. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవడంవల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, హృదయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి నియంత్రణకు కావలసిన కృత్రిమ ఇన్సులిన్‌ను 1922లో కెనడా దేశానికి చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్ అనే వైద్య శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1991లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెడరిక్ పుట్టిన రోజును ప్రపంచ మధుమేహ దినోత్సవంగా ప్రకటించింది.