Home > ESSAYS > రుతు చక్రం కాదది మానవ సృష్టి రథం : వ్యాసకర్త – అస్నాల శ్రీనివాస్

రుతు చక్రం కాదది మానవ సృష్టి రథం : వ్యాసకర్త – అస్నాల శ్రీనివాస్

  • May 28 International Menstrual Day సందర్భంగా

BIKKI NEWS : అంతర్జాతీయ ఋతు సంబంధ ఆరోగ్య నిర్వహణ దినోత్సవాన్ని(మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజిమెంట్ డే లేదా యం హెచ్ డే ) ప్రతి ఏటా మే 28 వ తేదీన నిర్వహిస్తారు .”ఋతుస్రావ పరిశుభ్రత ,ఆరోగ్యం పై నిధుల కేటాయింపు,కార్యోన్ముఖత* “((ACTION and INVESTMENT IN MENSTRUL HYGIENE,AND HELATH)ఇతివృత్తంతో మే 28,2021 ను నిర్వహించాలని వాష్ యునైటెడ్, వాటర్ ఫర్ పీపుల్, యునిసెఫ్ సంస్థలు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి. స్త్రీలలో జరిగే సహజ ఆరోగ్య జీవప్రక్రియ “రుతుస్రావం పై ధీర్ఘకాలంగా కొనసాగుతున్న వివక్షను, నిర్లక్ష్యాన్ని అంతం చేయడానికి యం హెచ్ నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని ,స్రీ పురుషులలో శాస్రీయ అవగాహనను కలిపించాలని నిర్దేశించాయి. 2014 లొ వాష్ యునైటెడ్ సంస్థ స్రీల ప్రయోజనార్ధం వారిని విద్య సామాజిక రంగాలలో సాధికారత వైపు నడిపించడానికి యం హెచ్ డే ను ప్రారంభించింది. నెలసరి వ్యవధి 28 రోజులు కాబట్టి దానికి ప్రతీకగా మే 28 ని యం హెచ్ డే గా జరుపుకోవాలని ప్రకటించింది . యం హెచ్ నిర్వహణ విధానాలు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన “సుస్తిరాభివృద్ధి లక్ష్యాలు -2030” లలో చక్కటి ఆరోగ్య జీవనం, నాణ్యమైన విద్య , లింగ సమానత్వం , స్వచ్చమైన నీరు పారిశుద్ధ్యం , గౌరవనీయమైన పని అభివృద్ధి , మరియు బాద్యాతాయుత వినియోగం ఉత్త్పత్తి వంటి లక్ష్యాల సాధనను వేగవంతం చేస్తాయని ఈ వెలుగులో రుతు సంబధ ఆరోగ్య నిర్వహణ సాధనకు తక్షణ కార్యాచరణ చేపట్టాలని ప్రపంచదేశాలను కోరింది.

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన “సుస్తిరాభివృద్ధి లక్ష్యాలు -2030” లలో రుతు సంబధ ఆరోగ్య నిర్వహణ సాధనకు తక్షణ కార్యాచరణ చేపట్టాలని ప్రపంచదేశాలను కోరింది.అస్నాల శ్రీనివాస్

ప్రస్తుతం ప్రపంచ మహిళా జనాభా 3.73బిలియన్లుగా ఉంది. వీరిలో 1.9బిలియన్ల అనగా 52% మహిళలు పునరుత్పత్తికి తొడ్పడే వయస్సులో ఉండే రుతుస్రావ ప్రక్రియను , దేహనిర్మాణంను కలిగివున్నారు . వీరిలో నెలసరి ఒక వాస్తవమైన ప్రక్రియ . “నెలవారి రుతుస్రావ ప్రక్రియలో విడుదలయ్యే రక్తమును శోషించుకునే లేదా సేకరించుకునే కిట్స్ ను వాడటం , వాటిని అమర్చుకోవడం , మార్చుకోవడం కోసం గోప్యత కలిగిన ప్రదేశాలు ఉండటం , సబ్బుతో ,నీటితో దేహాన్ని శుభ్రపరచుకోవడం , వాడిన నాప్కిన్స్ ను పర్యావరణ హిత విధానాలతో తొలగించడంలను ” రుతు సంబంధ ఆరోగ్య నిర్వహణ గా పిలుస్తున్నారు . ఒక స్త్రీ తన జీవితకాలంలో 3500 ల రుతుస్రావం రోజులను కలిగిఉంటుంది . అల్ప , మధ్యమ ఆదాయాలు కలిగిన ఆసియా ఆఫ్రికా కొన్ని ఐరోపా దేశాలలో రుతుస్రావ ఆరోగ్యం సంరక్షణ విధానాల వసతుల లేమి కారణంగా ఆయా దేశాల స్త్రీలు అనేకమైన శారీరక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు . ఈ రుతుస్రావం పై అశాస్త్రీయ వైఖరులు , అపోహలు , మూడ నమ్మకాలు కొనసాగుతున్నాయి . రుతుస్రావ దశలో ఉన్న స్త్రీని మురికి మలినమైన కలుషితమైన వ్యక్తిగా పరిగణించే ధోరణులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి అనేకమైన సామాజిక ఆంక్షలు నిషేధాల తో స్త్రీలను నిశ్శబ్ద హింసకు గురి చేస్తున్నారు , వంట గదిలో ఆరాధన స్థలాల ప్రవేశానికి నిరాకరిస్తున్నారు . ఆహార పదార్థాలను కూరగాయలను ముట్టుకో నివ్వడం లేదు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం , శుభకార్యాలకు వెళ్లకపోవడం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి గ్రామీణ భారతంలో ముట్టు గుడిసెలు , ముట్టు గదులలో స్త్రీలను వంటరిగా ఉండే అమానవీయ పద్ధతులు అమలవుతున్నాయి. రుతుస్రావానికి మత కర్మకాండలకు సంస్కృతికి అసహజ అన్యాయ అశాస్త్రీయ ముడి పడిపోవడం వలన కలిగే అనేక దుష్ఫలితాలను భారతీయ స్త్రీలు ఎక్కువగా అనుభవిస్తున్నారు.

బ్రిటన్ లో భారతీయ టీనేజ్ యువతి అమికా జార్జ్ ప్రారంభించిన “పిరియడ్ పావర్టీ “ఉద్యమం ఆ దేశ ప్రభుత్వాన్ని కదిలించి బాలికలందరికి ఉచిత నాప్కిన్స్ అందేలా చేసింది . అస్నాల శ్రీనివాస్

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-2016) ప్రకారం పేద వర్గాలు చదువుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలలో బాలికల తక్కువ హాజరు శాతానికి , బడి మానెయ్యటానికి రుతుస్రావం ఆరోగ్యం పై అవగాహనరాహిత్యం ప్రధాన కారకంగా ఉందని పేర్కొంది . నెలకు ఐదు రోజుల చొప్పున ఒక విద్యా సంవత్సరంలో యాభై రోజులు బడి మానేస్తున్నారు . కడుపునొప్పి , నాప్కిన్స్ వాడే ఆర్ధిక స్థోమత లేకపోవడం , మరకలు కనిపిస్తాయని భయం వల్ల బడి మానేస్తున్నారు . నెలసరి సమయంలో 70% కి పైగా బాలికలు అవమానకర ప్రక్రియ గా భావించి ఒత్తిడి , వ్యాక్యులత , నిర్వేదాలకు లోనై ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారని యన్ యఫ్ హెచ్ సర్వే తెలియచేసింది . కేవలం 55% బాలికలు మాత్రమే ఋతుస్రావాన్ని సహజ ప్రక్రియగా భావిస్తున్నారు . 45%బాలికలు గర్భాశయం నుండి వెలువడే మలిన రక్తంగా పరిగణిస్తున్నారు . 12%స్రీలు మాత్రమే నాప్కిన్స్ ను వాడుతున్నారు . మిగతా స్రీలు బట్ట ముక్కలు , ఆకులు , కాగితాలు , బూడిద వంటి సాధనాలు ఉపయోగిస్తున్నారు . ఫలితంగా స్రీలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ రుగ్మతలు , హిస్టరెక్టమి , గర్భాశయ కాన్సర్ లకు గురవుతున్నారు . దేశంలో సగానికి పైగా విద్యా సంస్థలలో , పని చేసే స్థలాలలో పీరియడ్ పావర్టి కొనసాగుతున్నది .

సర్వే ప్రకారం కేవలం 55% బాలికలు మాత్రమే ఋతుస్రావాన్ని సహజ ప్రక్రియగా భావిస్తున్నారు . 45%బాలికలు గర్భాశయం నుండి వెలువడే మలిన రక్తంగా పరిగణిస్తున్నారు . 12%స్రీలు మాత్రమే నాప్కిన్స్ ను వాడుతున్నారు. అస్నాల శ్రీనివాస్

యం హెచ్ యం పై ప్రపంచ దేశాల నిర్లక్ష్యం పై రుతుస్రావం పై మోపిన సాంస్కృతిక , మతపరమైన ఆంక్షలకు వ్యతిరేఖంగా మహిళా లోకం ఉద్యమిస్తున్నది . వీటికి భారతీయ మహిళలు నేతృత్వం వహిస్తున్నారు . బ్రిటన్ లో భారతీయ టీనేజ్ యువతి అమికా జార్జ్ ప్రారంభించిన “పిరియడ్ పావర్టీ “ఉద్యమం ఆ దేశ ప్రభుత్వాన్ని కదిలించి బాలికలందరికి ఉచిత నాప్కిన్స్ అందేలా చేసింది . ఈ విజయంతో. ది పింక్ ప్రొటెస్ట్ , ది రెడ్ బాక్స్ ప్రాజెక్ట్ “ఉద్యమాలు ఐరోపా ఆఫ్రికా వ్యాప్తంగా కొనసాగుతూ ఆరోగ్య సంరక్షణకు దారితీస్తున్నాయి . భారత్ లో నిఖిత ఆజాద్ “హ్యాపీ టు బ్లీడ్ “, తృప్తి దేశాయ్ “భూమాత బ్రిగ్రెడ్ ” ఉద్యమాల ప్రభావంతొ రుతుస్రావం ఒక నిషేధిత పదం తప్పు అనే భావన తొలగిపోయి స్వేచ్చగా మాట్లాడుకోవడం ప్రారంభమైయింది . రుతుస్రావం ఆరోగ్య సంరక్షణకు కావాల్సిన సానిటరీ నాప్కిన్స్ ను లగ్జరీ వస్తువులు గా భావించి నరేంద్ర మోడీ విధించిన 12% జి యస్ టి ని వెనక్కి తీసుకునేలా చేసాయి . అన్ని మతాల ఆరాధనా స్థలాల సందర్శన కు ఎటువంటి ఆంక్షలు ఉండరాదని సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించడానికి దారితీసింది . మోడీ ప్రారంభించిన స్వచ్ఛ విద్యాలయ , సబల , సువిధ , భేటీ బచావో భేటీ పడావో పథకాలు కనిష్ట నిధుల కేటాయింపులతో ప్రచారానికి పరిమితమయ్యి కనీస లక్ష్యాలను చేరుకోలేదని సర్వేలు తెలియచేస్తున్నాయి . సువిధ పథకం ద్వారా పది రూపాయలకు నాప్కిన్స్ పాకెట్ ని అందిస్తామని చెప్పిన మోడీ దేశంలో ఎక్కడ అమలు చేయలేదు .పైగా 2019 ఎన్నికల ప్రణాళికలో సువిధ ద్వారా ఒక్క రూపాయికే నాప్కిన్స్ ని అందచేస్తాను అని హామీ ఇచ్చాడు .ఇది కార్యరూపం ధరిస్తుందా లేదా కాలమే జవాబు చెప్పాలి .ఇది ఇలా ఉండగా ఆరాధనా స్వేచ్ఛ పై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మెజారిటీ మతస్తుల విశ్వాసాలను భంగపరుస్తుందని కృత్రిమ ఉద్యమాలను జరిపి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం చేసారు .

మోడీ ప్రారంభించిన స్వచ్ఛ విద్యాలయ , సబల , సువిధ , భేటీ బచావో భేటీ పడావో పథకాలు కనిష్ట నిధుల కేటాయింపులతో ప్రచారానికి పరిమితమయ్యి కనీస లక్ష్యాలను చేరుకోలేదని సర్వేలు తెలియచేస్తున్నాయి .అస్నాల శ్రీనివాస్

యమ్ యచ్ యమ్ లో శాస్రీయ అవగాహనలో , నీరు పారిశుద్ధ్య సౌకర్యాల కల్పనలొ ,బాలికా ఆరోగ్య విద్యా వికాసంలొ కేరళ, తెలంగాణ రాష్ట్రాలు నిబద్ధతతొ నమూనా కార్యక్రమాలను అమలు చేస్తున్నవి .తెలంగాణలొ ప్రభుత్వ,స్థానిక సంస్థల , సంక్షేమ గురుకులాల , కస్తుర్భా విద్యాలయాల్లో చదువుతున్న ఏడు లక్షల కి పైగా బాలికలకు ఉచిత నాప్కిన్స్ ను , హెల్త్ కిట్స్ ను పంపిణి ని చేస్తున్నారు . విద్యా , ఆరోగ్య , శ్రీ శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఛైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది . పలితంగా బాలికల హాజరు శాతం పెరిగి డ్రాప్ అవుట్స్ తగ్గుముఖం పట్టాయి . తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని “బాలికా విద్యా వికాస సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు .

తెలంగాణలొ ప్రభుత్వ,స్థానిక సంస్థల , సంక్షేమ గురుకులాల, కస్తుర్భా విద్యాలయాల్లో చదువుతున్న ఏడు లక్షల కి పైగా బాలికలకు ఉచిత నాప్కిన్స్ ను , హెల్త్ కిట్స్ ను పంపిణి ని చేస్తున్నారు .అస్నాల శ్రీనివాస్

ఈ కరోనా కలిగించిన ఉపద్రవం వలన ప్రతిరోజు 500 మిలియన్ల స్త్రీలు నాప్కిన్స్ , సానిటేషన్ సౌకర్యాల లేమితో బాధపడుతున్నారు.ఋతు ఆరోగ్య ఉత్పత్తులు తగ్గిపోయాయి. వాటి ధరలు పెరిగిపోయాయి. బడులు బంద్ కావడంతో తెలంగాణ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఉచితంగా అందించే నాప్కిన్స్ పంపిణీ ఆగిపోయింది. ఆరోగ్య కేంద్రాలు సాధారణ సేవలను తగ్గించాయి. డిజిటల్ ఇంటర్నెట్ వేదికలలో స్త్రీల భాగస్వామ్యం తక్కువ కావున వారికి సరైన వైద్య సమాచారం సలహాలు అందడం లేదు. శ్రామిక వర్గ స్త్రీలు జీవికకు కావాల్సిన ప్రాధమిక అవసరాల పైన దృష్టి పెట్టారు. నాప్కిన్స్ సానిటేషన్ ల వెచ్చించడం లేదు.. లాక్డౌన్ కాలంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉండడం ఇంట్లో మనసులలో గూడు కట్టుకున్న పితృస్వామిక వైరస్ భావాల వలన స్త్రీలు మరింత న్యూన్యత కు ఒత్తిడి కి లోనవ్వుతున్నారు. మహమ్మారుల కాలంలో ఋతుచక్రాలు ఆగవు. గృహ సంబంధ చిట్కాలు ఉత్పత్తులు తో ఋతు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రచారం ఎక్కువ చెయ్యాలి. ఆన్లైన్ , టెలి మెడిసిన్ , సామాజిక మాధ్య సందేశాలు ద్వారా ఋతు ఆరోగ్య అవగాహన ప్రచారాన్ని ఎక్కువ చెయ్యాలి.

గృహ సంబంధ చిట్కాలు ఉత్పత్తులు తో ఋతు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రచారం ఎక్కువ చెయ్యాలి. ఆన్లైన్ , టెలి మెడిసిన్, సామాజిక మాధ్య సందేశాలు ద్వారా ఋతు ఆరోగ్య అవగాహన ప్రచారాన్ని ఎక్కువ చెయ్యాలి. – అస్నాల శ్రీనివాస్

రుతుస్రావ ఆరోగ్య సంరక్షణ స్త్రీలలో ఆరోగ్యాన్ని ,ఆత్మ విశ్వాసాన్ని గౌరవాన్ని కలిగిస్తుంది . ఇది మహిళల మౌళిక మానవ హక్కుగా భావించినప్పుడే లింగ సమానత్వానికి దారితీస్తుంది .యమ్ హెచ్ యమ్ సవ్యంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , సేవా సంస్థలు ,పౌర సమాజం సమిష్టిగా పనిచేయాలి . తద్వారా స్రీలు విద్యా ఉత్పాదక రంగాలలో చురుకుగా పాల్గొంటారు . పురుషులతో పాటు స్రీలు అన్ని రంగాలలొ తమ ప్రతిభను ,నైపుణ్యాలను కనపరచినప్పుడు సుస్థిర , సమ్మిళిత ఆర్ధికాభివృద్ధి , జి డి పి పెరుగుతుందని చరిత్ర రుజువు చేస్తున్నది .

అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘము
9652275560