NATIONAL SPORTS DAY – జాతీయ క్రీడా దినోత్సవం

BIKKI NEWS : జాతీయ క్రీడా దినోత్సవం (NATIONAL SPORTS DAY ON AUGUST 29th)ను భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ (Dyan Chand) గౌరవ సూచకంగా ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు.

NATIONAL SPORTS DAY ON AUGUST 29th

ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు Major Dyan Chand Khel Rathna Award, Arjuna Awards, Dronacharaya Awards ఇచ్చి గౌరవిస్తారు.

భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ (ఆగష్టు 29, 1905 – డిసెంబర్ 3, 1979), తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా తర్వాత కెప్టెన్ గా గుర్తించబడినాడు. ధ్యాన్ చంద్ తన జట్టుతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు (1928 ఆమస్టర్ డాం, 1932 లాస్ ఏంజెల్స్, 1936 బెర్లిన్) సాధించాడు.

ఇతను భారత ప్రభుత్వంచే 1956లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. దీంతో గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్‌చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజున ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవమును జరుపుకుంటారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు