Home > ESSAYS > 75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు

75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు

కరీంనగర్ (నవంబర్ – 10) : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, న్యూఢిల్లీ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ వారి ఆర్థిక నిధులతో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలకు చెందిన అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున “ 75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ ” అనే అంశంపై రెండో రోజు జాతీయ సదస్సు ముగింపు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి, ఆర్బిఐ పూర్వపు చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎస్ ఇంద్ర కాంత్ హాజరైనారు.

ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రొఫెసర్ ఏం. లింగమూర్తి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో గడిచిన ఏడు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలు మరియు అంతరాలను గుర్తించాలని, భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారాలను సూచించిందని, ఈ సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అభిప్రాయాల సూచికగా ఉపయోగపడుతుందని సూచించారు.

ఆర్థిక స్వాతంత్ర్యం లేనిదే రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించలేదని, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే ఆర్థిక స్వాతంత్ర్యమని, గత 75 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఆహార ధాన్యాల విషయంలో తీవ్రమైన పరివర్తనలకు గురి అయినదని, 1960 ప్రాంతంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆహార ధాన్యాలలో కొరత ఉండేదని ప్రస్తుతం ఆహార ధాన్యాలలో మిగులు ఏర్పడి నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వాలు కనీస మద్దతు ధరలు కల్పించాలని ఎస్. ఇంద్రకాంత్ పేర్కొన్నారు .

భారత ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిని సాధిస్తుందని శాతవాహన విశ్వవిద్యాల రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం. వరప్రసాద్ ఉద్బోధించారు. గౌరవ అతిధులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ మహమ్మదు జాఫర్ జెర్రీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు గురించి వివరించారు, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కోడూరి శ్రీవాణి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులకు లోనైందని, ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో 4 టెక్నికల్ సెషన్స్ ద్వారా 85 మంది ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు పరిశోధన పత్రాలను సమర్పించి చర్చలలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్.రాములు, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ కే. అంజిరెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ, డాక్టర్ ఎం. ఉషారాణి, తిరుపతి, రాజేందర్, విద్యాసాగర్, ఫాతిమా సుల్తానా, జమున, రాధిక, శ్రీనివాస్, కాంతయ్య, ఆమోల్, వెంకటేష్ మొదలగు పరిశోధకులు, విద్యార్థిని విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.