Home > SPORTS > ASIA CUP : ఆసియా కప్ క్రికెట్ విజేతల లిస్ట్ – విశేషాలు

ASIA CUP : ఆసియా కప్ క్రికెట్ విజేతల లిస్ట్ – విశేషాలు

BIKKI NEWS : ఆసియా క్రికెట్ కప్ 1984 లో మొదటి సారి ప్రారంభమైంది. మొదటి టోర్నీ విజేతగా భారతదేశం నిలిచింది. శ్రీలంక రన్నరప్ గా నిలిచింది. ఆసియా ఖండపు దేశాలతో ఈ టోర్నమెంట్ నిర్వహింస్తారు. 1984 నుండి 2014 వరకు 12 సిరీస్ లను వన్డే పార్మాట్ లో , 2016 నుంచి టీట్వంటీ పార్మాట్ లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. 2022 విజేతగా శ్రీలంక నిలిచింది. 2023 టోర్నీ మళ్లీ వన్డే ఫార్మాట్ లో నిర్వహించారు. ఫైనల్ లో ఇండియా – శ్రీలంక తలపడ్డాయి. భారత్ 8వ సారి విజేతగా నిలిచింది. (Asia cup winners list and history )

ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక లో జరుగుతున్న టోర్నీ 16వది… భారత్ గరిష్టంగా 8 సార్లు విజేతగా నిలిచింది. 2016, 2018 టీట్వంటీ పార్మాట్ లో జరగిన టోర్నీలలో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంక 6సార్లు, పాకిస్థాన్ 2 సార్లు విజేతగా నిలిచాయి. ఎక్కువ పరుగులు సనత్ జయసూర్య (1220) పేరిట, ఎక్కువ వికెట్లు లసిత్ మలింగా (33) పేరిట ఉన్నాయి.

సంవత్సరంవిన్నర్రన్నర్
2023భారత్శ్రీలంక
2022శ్రీలంకపాకిస్థాన్
2018భారత్బంగ్లాదేశ్
2016భారత్బంగ్లాదేశ్
2014శ్రీలంకపాకిస్థాన్
2012పాకిస్థాన్బంగ్లాదేశ్
2010భారత్శ్రీలంక
2008శ్రీలంకభారత్
2004శ్రీలంకభారత్
2000పాకిస్థాన్శ్రీలంక
1997శ్రీలంకభారత్
1995భారత్శ్రీలంక
1990భారత్శ్రీలంక
1988భారత్శ్రీలంక
1986శ్రీలంకపాకిస్థాన్
1984భారత్శ్రీలంక