Home > EMPLOYEES NEWS > 9 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

9 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్

BIKKI NEWS (జనవరి – 11) : ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ఎడ్యుకేషన్ ట్రిప్ కు తీసుకెళ్లడంతో వనపర్తి జిల్లా పెద్ద మందడి జిల్లా పరిషత్ హై స్కూల్ లోని 9 మంది ఉపాధ్యాయులను (9 teachers suspended in wanaparthy district) జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జనవరి 11న కలెక్టర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేయగా తొమ్మిది మంది ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంతో, దీనిపై హెచ్ఎం ను వివరణ కోరగా ఎడ్యుకేషన్ ట్రిప్ కు వెళ్లారని తెలపగా, అనుమతి లేకుండా ట్రిప్ కు వెళ్లడంతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.