స్మార్ట్ ఫోన్ లతో 80 కోట్ల మంది పేదరికం నుండి బయటకు – ఐరాస

BIKKI NEWS (AUG. 03) : 80 crore People out of poverty in india by smart phones. గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్య సమితి ఈ సందర్భంగా ప్రశంసించింది.

80 crore People out of poverty in india by smart phones

‘డిజిటలైజేషన్‌ అనేది ఓ దేశం వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు కారణం అవుతుంది. ఉదాహరణకు భారత్‌నే తీసుకోండి.. గత ఐదారేళ్లలోనే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ద్వారా 800 మిలియన్ల (80 కోట్ల మంది) మంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేయగలిగింది. గతంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు గ్రామీణ రైతులు పేమెంట్స్ అందుకోవడం, బిల్లులు చెల్లించడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారానే చిటికెలో చేసేస్తున్నారు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసి, దేశ ప్రజలు ప్రయోజనం పొందడానికి భారత్‌లో ఇంటర్‌నెట్‌ వ్యాప్తి ఎంతగానో తోడ్పడుతోంది. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఇటువంటి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు