567 మంది గురుకుల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (సెప్టెంబర్ – 04) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసిన విషయం తెలిసిందే. 567 gurukula contract teachers regularization in telangana

2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్‌ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి వారి సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేసింది.