TS JOBS : 3,124 పోస్టుల మంజూరు

హైదరాబాద్ (ఆగస్టు 09): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (TVPP) పరిధి హస్పిటల్ లలో 3,124 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు తెలిపింది. 3124 new jobs sanctioned in telangana vaidya vidhana parishad

వీరిలో 968 కాంట్రాక్ట్ పోస్టులు, 2,029 ఔట్ సోర్సింగ్, 127 పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులుమొదలు సెక్యూరిటీ గార్డు వరకు ఉన్నాయి.