తిరువనంతపురం (ఆగస్టు 09) : కేరళ రాష్ట్రం పేరు మారనుంది. ఇక నుంచి కేరళను “కేరళం” (KERALAM) గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించనుంది. Keralam is a new name for kerala state
అనంతరం పేరు మార్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. రాజ్యాంగంలోనేగాక అన్ని అధికార రికార్డులలో రాష్ట్రం పేరు మార్చాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నది.
ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల పేర్లు మారాయి. అవి ఒరిస్సాను ఒడిశా గా, అస్సాం ను అసోం గా పేరు మార్చిన విషయం తెలిసిందే.