BIKKI NEWS (MARCH 07) : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత తరఫున రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ తరఫున బెయిర్‌స్టో తమ 100వ టెస్ట్ మ్యాచ్ ను (100th test match played indian cricketers) ఆడుతున్నారు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు 100 టెస్ట్ మ్యాచ్ ఆడడం ఇదే మొదటిసారి. రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరపున వందో టెస్ట్ ఆడుతున్న 14వ క్రీడాకారుడు కాగా, అంతర్జాతీయంగా 78 వ ఆటగాడిగా నిలిచాడు. బారత్ తరపున అత్యధిక టెస్ట్ లను సచిన్ టెండూల్కర్ (200) ఆడాడు.ఇంతకుముందు 100 టెస్టులు ఆడిన భారత క్రీడాకారుల జాబితాను చూద్దాం.
భారత్ తరపున వంద టెస్ట్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్స్.
- సచిన్ టెండూల్కర్: 200
- రాహుల్ ద్రవిడ్ :- 163
- వీవీఎస్ లక్ష్మణ్ :- 134
- అనిల్ కుంబ్లే :- 132
- కపిల్‌దేవ్ :- 131
- సునీల్ గవాస్కర్ :- 125
- దిలీప్ వెంగ్ సర్కారు :- 116
- సౌరవ్ గంగూలీ :-113
- ఇషాంత్ శర్మ :- 105
- వీరేంద్ర సెహ్వాగ్ :- 103
- హర్భజన్ సింగ్ :-103
- చటేశ్వర్ పూజార – 103*
- విరాట్ కోహ్లీ – 113*
- రవిచంద్రన్ అశ్విన్ – 100*