Home > SPORTS > WORLD BLITZ CHESS CHAMPS 2023 – కార్లసన్, వాలెంటినా గునినా

WORLD BLITZ CHESS CHAMPS 2023 – కార్లసన్, వాలెంటినా గునినా

BIKKI NEWS (DEC.31) : WORLD BLITZ CHESS CHAMPIONSHIP 2023 WON BY CARLSEN and VALANTEINA – ప్రపంచ బ్లిట్జ్ ఛాంఫియన్స్ – 2023 గా పురుషుల విభాగంలో డిపెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌‌సన్ (నార్వే), మహిళల విభాగంలో రష్యాకు చెందిన వాలెంటినా గునినా టైటిల్ ను గెలుచుకున్నారు.

ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ ను నిలబెట్టుకున్న కార్ల్‌‌సన్, ఇప్పుడు బ్లిట్జ్ టైటిల్ తో ప్రపంచ చెస్ లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.

మరోవైపు భారత క్రీడాకారులలో కోనేరు హంపి ర్యాపిడ్ విభాగంలో రజతం నెగ్గిన విషయం తెలిసిందే. అయితే బ్లిట్జ్ లో మాత్రం నిరాశపరిచారు. అర్జున్ ఇరిగేశి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ద్రోణవల్లి హారిక ఏడో స్థానంతో ముగించింది. కోనేరు హంపి 10.5 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది.

క్యాండిడేట్స్ టోర్నీకి గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి

భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ఎనిమిది మంది ఆటగాళ్లు పోటీపడే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ టోర్నమెంటు అర్హత సాధించాడు. ప్రపంచ బ్లిట్జ్ చెస్ లో అనీష్ విజేతగా నిలవలేకపోవడంతో గుకేశ్ కు అవకాశం దక్కింది. గుకేశ్ అర్హతతో చరిత్రలో తొలిసారి ముగ్గురు భారతీయులు క్యాండిడేట్స్ టోర్నీలో ఆడనున్నారు. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి ఈ టోర్నీలో ఆడనున్న మరో ఇద్దరు భారత ఆటగాళ్లు.