BIKKI NEWS (JAN. 02) : Women Teachers day on January 3rd Savithri bhai phule Jayanthi. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Women Teachers day on January 3rd Savithri bhai phule Jayanthi
మహత్మ జ్యోతిభా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జయంతి రోజైన జనవరి 3న ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు సావిత్రి భాయ్ ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
- GK BITS IN TELUGU MARCH 13th
- చరిత్రలో ఈరోజు మార్చి 13
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్