Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS : ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు

INTER EXAMS : ఇంటర్‌ పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు

BIKKI NEWS (MARCH 09) : WALL CLOCKS IN INTER EXAM HALLS. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ప్రతి రూమ్ లో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.

WALL CLOCKS IN INTER EXAM HALLS

సోమవారం పరీక్ష ప్రారంభమయ్యే నాటికి పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదుల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాల ఇంటర్‌ అధికారులను ఆదేశించారు.

ఈసారి ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల సాజరణ, స్మార్ట్, రిస్ట్‌ వాచ్‌లను అనుమతించలేదు. సమయాన్ని సూచిస్తూ అరగంటకు ఒకసారి గంట కొడతారని, ఇన్విజిలేటర్లు కూడా సమయం చెబుతారని ఇటీవల బోర్డు కార్యదర్శి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో 1,532 పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని కృష్ణ ఆదిత్య జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గోడ గడియారం కొనుగోలుకు రూ.100 చొప్పున మంజూరు చేస్తామని ఆదేశాల్లో పేర్కొన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు