BIKKI NEWS (DEC. 20) : VTG CET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సోసైటీల కింద పని చేస్తున్న గురుకులాల్లో 2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
VTG CET 2025 NOTIFICATION
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్దం చేస్తుంది.
అర్హతలు : 2024 – 25 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 4 వ తరగతి చదువుతూ ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : 21- డిసెంబర్ – 2024 నుండి 1 – ఫిబ్రవరి – 2025 వరకు
దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (ఒక ఫోన్ నెంబర్ తో ఒక ధరఖాస్తు మాత్రమే చేయవచ్చును.)
పరీక్ష తేదీ : 23- ఫిబ్రవరి -2025న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు
పరీక్ష కేంద్రాలు :అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.
అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టివారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును.
విద్యార్థుల ఎంపికకు “పాతజిల్లా” ఒక యూనిట్ ‘గా పరిగణింపబడుతుంది.
వెబ్సైట్ :
https://tgswreis.telangana.gov.in
https://tgtwgurukulam.telangana.gov.in
https://mjptbcwreis.telengana.gov.in
VTG CET PREVIOUS QUESTION PAPER
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE