Vidydhan Scholarship : ఇంటర్ విద్యార్థులకు 10 వేల విద్యాధాన్ స్కాలర్షిప్

హైదరాబాద్ (జూన్ – 11) : పదవ తరగతిలో 90% మార్కులు లేదా 9 సిజిపిఏ మార్కులు అధిగమించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో 10,000 ఆపై తరగతులకు పది వేల నుండి 60 వేల వరకు స్కాలర్షిప్లను అందజేసే విద్యాదాన్ స్కాలర్షిప్ లకు (vidyadhan scholarship 2023) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

◆ అర్హతలు : పదవ తరగతిలో 90% మార్కులు లేదా 9 సిజిపిఏ గ్రేడ్ సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి. దివ్యాంగులైతే పదో తరగతిలో 75% మార్కులు లేదా 7.5% సిజిపిఏ సాధించి ఉండాలి.

◆ దరఖాస్తు గడువు : జులై 15 – 2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

◆ ఉపకార వేతనాలు : ఇంటర్మీడియట్ లో సంవత్సరానికి 10,000/- ఆపై తరగతులకు పదివేల నుంచి 60 వేల వరకు స్కాలర్షిప్ ను అందజేస్తారు.

◆ మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ : 9663517131

◆ వెబ్సైట్ : www.vidyadhan.org