Home > JOBS > UPSC > UPSC NDA & NA (I) 2025 NOTIFICATION

UPSC NDA & NA (I) 2025 NOTIFICATION

BIKKI NEWS (DEC. 12) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ – I (UPSC NDA & NA – I NOTIFICATION 2025) ద్వారా మొత్తం 406 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

జనవరి – 2026 నుంచి ప్రారంభమయ్యే 155వ కోర్సులో, 117వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.

ఖాళీల వివరాలు : NDA – 370, NA – 36

అర్హతలు : ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయోపరిమితి : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02- జూలై -2006 నుండి 01- జూలై -2009 మధ్య జన్మించాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : డిసెంబర్ – 31 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జనవరి 1 – 7 వరకు

పరీక్ష తేదీ : ఎప్రిల్- 13 – 2025

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF FILE

APPLY HERE

వెబ్సైట్ : https://upsc.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు