UGC NET, CSIR NET EXAM DATES – NTA

BIKKI NEWS (JUNE 29) : UGC NET and CSIR UGC NET 2024 NEW EXAM DATES ANNOUNCED BY NTA. రద్దు అయినా యూజీసీ-నెట్ పరీక్ష మరియు వాయిదా పడిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల నూతన నిర్వహణ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

యూజీసీ నెట్ పరీక్ష జూన్ 18న జరగగా.. ఆ మరుసటి రోజే అనగా జూన్ 19న దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. యూజీసీ- నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 తేదీల మధ్యలో తిరిగి నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంతకుముందు జూన్ 18న యూజీసీ-నెట్ పరీక్ష ఆఫ్ లైన్ పద్ధతిలో జరిగింది. అభ్యర్థులు పేపర్, పెన్నుతో పరీక్ష రాశారు. అయితే ఈసారి అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తామని ఎన్‌టీఏ

ఇక ‘ఎన్‌సెట్’ పరీక్షను జులై 10న, ‘సీఎస్ఐఆర్- యూజీసీ నెట్’ పరీక్షను జులై 25 నుంచి 27 తేదీల మధ్య నిర్వహిస్తామని తెలిపింది. ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్టు మునుపటి షెడ్యూల్ ప్రకారమే జులై 6న జరుగుతుందని స్పష్టం చేసింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు