హైదరాబాద్ (సెప్టెంబర్ 20) : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సర్వీసులు ప్రభుత్వ సర్వీసులో విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయ శాఖ ఈ మేరకు తాజాగా గెజిట్ విడుదల చేసింది. tsrtc employees merged into govt services gazette released. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు చట్టరూపం దాల్చింది. గవర్నర్ ఆర్టీసి విలీనం బిల్లుకు గత వారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఏ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు రవాణాశాఖ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
ఇంకా పలు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో 43,030 మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు.