TS RDC CET RESULTS – గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (JUNE 04) : TS RDC CET 2024 RESULTS LINK. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 28న నిర్వహించిన RDCCET 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలతో పాటు సీట్ల కేటాయింపు వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర.డీసీ సెట్ – 2024 కన్వీనర్ బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయించిన సీట్లలో విద్యార్థులు జూన్ 05 నుంచి 13 వరకు సంబంధిత కాలేజీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలుండగా ఇందులో అమ్మాయిల కోసం 15, అబ్బాయిల కోసం 15 కాలేజీలు అందుబాటులో ఉన్నాయనీ, 9,220 సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. 26 మహిళా సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 7,080 సీట్లు, 21 గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 4,040 సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

బీసీ డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సులతో పాటు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

TS RDCCET 2024 RESULTS LINK