MODEL SCHOOL – ప్రవేశ పరీక్ష ఫలితాల తేదీ – అడ్మిషన్ల షెడ్యూల్

BIKKI NEWS (APRIL 08) : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 194 మోడల్ స్కూల్ లలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం ఎప్రిల్ 7న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 25వ తేదీన విడుదల (ts model school entrance test results date) చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.

అలాగే ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్ 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చు అని ప్రకటించింది.