TS EAPCET 2024 NOTIFICATION – ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (FEB. 26) : తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వహించే TS EAPCET 2024 NOTIFICATION ను జేఎన్టీయూ – హైద‌రాబాద్ ప్ర‌క‌టించింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

ఈ ఏడాది ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్‌కు సంబంధించిన‌ 100 శాతం సిల‌బ‌స్‌తో టీఎస్ ఎప్‌సెట్‌ను కండ‌క్ట్ చేయ‌నున్నారు. ప్ర‌వేశ ప‌రీక్ష ఇంగ్లీష్ – తెలుగు, ఇంగ్లీష్ – ఉర్దూ భాష‌ల్లో ఉండ‌నుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్‌లోని ప్రశ్నల్లో తేడాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే ఫైనల్‌గా తీసుకుంటారు

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు :

ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు.
రూ. 250/- ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వ‌ర‌కు,
రూ. 500/- ఆల‌స్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
రూ. 2500/- ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 19 వ‌ర‌కు,
రూ. 5000/- ఆల‌స్య రుసుంతో మే 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అర్హతలు : ఇంటర్మీడియట్

దరఖాస్తు ఫీజు : ఒక్క పేపర్ కు – 900/- (SC, ST, PwD – 500/-)

రెండు పేపర్లకు – 1,800/- – (SC, ST, PwD – 1,000/-) (రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.)

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ – ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మ‌ధ్య‌లో విద్యార్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు.

హల్ టికెట్ల విడుదల : మే 1వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుదారులు త‌మ హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

పరీక్ష తేదీలు :

ఇంజనీరింగ్ స్ట్రీమ్ :

మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల‌కు (ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు)

అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్ –

మే 11, 12 తేదీల్లో అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కోర్సుల‌కు (ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

వెబ్సైట్ : https://eamcet.tsche.ac.in/