TS EAPCET 2024 – నేటి నుండి పరీక్షలు – నిబంధనలు ఇవే

BIKKI NEWS (MAY 07) : TS EAPCET 2024 Exams Guidelines – తెలంగాణ ఎప్‌సెట్ పరీక్షలు నేటి నుండి 11వరకు ప్రారంభంకానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

మే 7, 8వ తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు రాతపరీక్షలను నిర్వహిస్తారు.

TS EAPCET 2024 GUIDELINES

పరీక్షా ప్రారంభానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.

మొదటిసారిగా అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు.

బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులు మెహందీ (గోరింటాకు), టాటూలు వేసుకురావొద్దు.

బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను, హాల్టికెట్, దరఖాస్తు ఫారం, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు తెచ్చుకోవద్దని అధికారులు సూచించారు.

మ్యాథమెటికల్, లాగ్ టేబుళ్లు, పేజర్లు, సెల్ఫోన్లు, చేతిగడియారం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదు