TS EAPCET 2024 EDIT OPTION – ఈఏపీ సెట్ ఎడిట్ ఆప్షన్

BIKKI NEWS (APRIL 07) : TS EAPCET 2024 EDIT OPTION – టీఎస్ ఈఏపీ సెట్ 2024 దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ను కల్పించారు.

ఏప్రిల్ 8 నుండి 12వ తారీకు వరకు ఎడిట్ ఆప్షన్ విద్యార్థులకు అందుబాటులో ఉండనుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఎడిట్ ఆప్షన్ ను పొందవచ్చు.

అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలతో లాగిన్ కావలసి ఉంటుంది.

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ₹250 రూపాయల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, మరియు ₹5000 రూపాయల ఆలస్య రుసుముతో మే 01వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం టీఎస్ ఈఏపీ సెట్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిని గతంలో ఎంసెట్ పేరుతో పిలిచేవారు. మెడికల్ సీట్లు నీట్ ద్వారా భర్తీ చేయటంతో ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చిన విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://eapcet.tsche.ac.in/