EAMCET ఇక EAPCET.!

BIKKI NEWS (JAN. 15) : తెలంగాణ రాష్ట్రంలో TS EAMCET పేరును TS EAP CET లేదా TS EACET గా మార్చాలని (TS EAMCET NAME CHANGED AS TS EAPCET) తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

దీనికి కారణం 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్‌, ఇతర వైద్య కోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తోంది. అయినప్పటికీ ఎంసెట్‌ పేరులో మెడికల్‌ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంసెట్ పేరును AP EAP CET గా మార్చిన విషయం తెలిసిందే