BIKKI NEWS (JUNE 15) : Trump strong warning to Iran. ఇరాన్ దేశం తమ స్థావరాలపై దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
Trump strong warning to Iran.
ప్రస్తుతం ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న దాడులకు అమెరికా కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని ఆపే శక్తి తనకు ఉందని కావాలంటే ఇప్పటికిప్పుడు ఆపగలనని కూడా పేర్కొన్నారు.
యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ లో ఏమీ మిగలదని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
బ్రిటన్, ప్రాన్స్, అమెరికా దేశాలు తమపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు మద్దతు ప్రకటిస్తే వాటి స్థావరాలపై కూడా దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- DAILY GK BITS IN TELUGU 16th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ – 16
- World Waterfalls – ప్రపంచంలోని ఎత్తైన జలపాతాలు
- WATER FALLS DAY – ప్రపంచ జలపాతాల దినోత్సవం
- INDIA WATER FALLS – ఇండియాలో ముఖ్య జలపాతాలు ఎత్తు ఆధారంగా