Home > LATEST NEWS > TODAY NEWS > TODAY NEWS IN TELUGU ON AUGUST 2nd 2024

TODAY NEWS IN TELUGU ON AUGUST 2nd 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 08 – 2024

BIKKI NEWS (AUG 02) : TODAY NEWS IN TELUGU on 2nd AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU ON AUGUST 2nd 2024

TELANGANA NEWS

ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ( గురువారం ఇచ్చిన తీర్పును అమలు చేస్తాం – రేవంత్ రెడ్డి

మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా 300 బస్సులను సెమీ డీలక్స్‌, మెట్రో డీలక్స్‌ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని సంకల్పించింది.

ఉద్యోగ నియామకాల కోసం రూపొందించిన జాబ్‌ క్యాలెండర్‌కు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీలో ఈ వివరాలను ప్రకటించనున్నది.

వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప ద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. 

తెలంగాణలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..

తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయాలు – క్లిక్

ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌, హరీష్ రావు

20 ఏండ్ల పోరాటానికి దక్కిన ఫలితం: మంద కృష్ణ

తాము సభలో నాలుగున్నర గంటలు నిలబడితే సీఎం, అధికారపక్ష సభ్యులు రాక్షసానందం పొందారని, తమ ఇంటి ఆడబిడ్డలకు అలా జరిగితే అలాగే ప్రవర్తిస్తారా? అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANDHRA PRADESH NEWS

ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ( గురువారం ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం.

పథకాలు అమలుకు ఖాజానా సహకరించడం లేదు – బాబు

సూపర్ సిక్స్ ఎగ్గోంటెందుకు ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ – మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.

అధైర్య పడవద్దు… చివరి వరకు అండగా ఉంటాం… కార్యకర్తలతో జగన్

NATIONAL NEWS

ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్‌ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ర్టాలకు రాజ్యాంగపరమైన అధికారం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది..

స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరపొచ్చు – సుప్రీం కోర్టు

రెండో బార్యకు ఫించన్ ఇవ్వాల్సిందే – సుప్రీం తీర్పు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 296కు చేరింది. చలియార్‌ నదిలోనే ఇప్పటివరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి.

వ‌య‌నాడ్ విల‌య ప్రాంతంలో ప‌ర్య‌టించిన‌ రాహుల్ గాంధీ.

విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఎస్సీల్లో క్రిమీలేయ‌ర్‌ను గుర్తించే విధానాన్ని రూపొందించాలి: జ‌స్టిస్ గ‌వాయి.

ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారి.

కొత్త పార్లమెంట్‌ భవనంలో లీకేజీ….
‘బయట పేపర్‌ లీకులు, లోపల వాటర్‌ లీకులు’.. పార్లమెంట్‌ లాబీలో నీటి లీకేజీపై కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు.

INTERNATIONAL NEWS

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం ఉంది.. ప్రత్యక్ష దాడికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆదేశం.

ఆమె భార‌తీయురాలా? లేక న‌ల్ల‌జాతీయురాలా?.. క‌మ‌లా హ్యారిస్ మూలాల‌పై డోనాల్డ్ ట్రంప్.

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాయి.

సెన్సెక్స్ : 81,867 (126)
నిఫ్టీ : 25,011 (60)

జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జూలై నెలకుగాను రూ.1.82 లక్షల కోట్ల వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.4,940 కోట్ల మేర వసూలయ్యాయని పేర్కొంది

ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 5 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

వరుసగా మూడో నెలలోనూ అదే రికార్డు.. జూలైలో రూ.20 లక్షల కోట్లు దాటిన యూపీఐ పేమెంట్స్

వరుసగా మూడో రోజూ పెరిగిన బంగారం.. అదే బాటలో వెండి.

SPORTS NEWS

పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌లో స్వప్నిల్ కుశాల్ కు కాంస్యం. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం. ఐదు రోజుల వ్యవధిలో 3 పతకాలు తెచ్చిన షూటర్లు.

స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో నిలిచిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఇంటిబాట,

బ్యాడ్మింటన్‌ స్టార్‌ ద్వయం సాత్విక్‌-చిరాగ్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రయాణం ముగిసింది.

టీటీ ప్రిక్వార్టర్స్‌లో శ్రీజకు తప్పని ఓటమి.

హాకీలో భారత్‌కు తొలి పరాజయం.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ పోరులో సింధు 19-21, 14-21తో చైనాకు చెందిన హీ బింగ్‌జియావో చేతిలో ఓడింది.

భారత్‌, శ్రీలంక మధ్య తొలి వన్డే నేడు జరుగనుంది. మ: 2.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం.

EDUCATION & JOBS UPDATES

IBPS JOBS – బ్యాంకుల్లో 5291 పోస్టులు. ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు 4455, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌- 896 పోస్టులు

టీఎస్‌ సెట్‌-2024 వచ్చే నెల 10 నుంచి నిర్వహించనున్నట్టు టీఎస్‌ సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ నరేశ్‌రెడ్డి తెలిపారు..

ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు ఎల్‌వోపీ ని ఎన్ఎంసీ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ కి శంకుస్థాపన.

ఏపీలో బీబీఏ, బీసీఏ కనీస ఫీజు 18 వేలు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు