Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 08 – 2024

BIKKI NEWS (AUG 06) : TODAY NEWS IN TELUGU on 6th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th AUGUST 2024

TELANGANA NEWS

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీచేసే వరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకోరా? అని అడ్వకేట్‌ జనరల్‌ను ప్రశ్నించింది.

హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది.

షాద్‌నగర్‌ దళిత మహిళ ఘటనపై బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండిపడ్డారు.

అటానమస్‌ కాలేజీ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వెల్లడించింది.

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలలకు పరిశుభ్రతకు గ్రాంటును కేటాయించారు. కనిష్టంగా రూ.3 వేలు, గరిష్టంగా రూ.20 వేల చొప్పున పది నెలల పాటు గ్రాంటు ఇవ్వనున్నారు.

మేడిగడ్డ బరాజ్‌ కుంగిన ఘటనపై కేసీఆర్ పై పిటిషన్‌. సెప్టెంబర్‌ 5న హాజరు కావాలన్న భూపాలపల్లి కోర్టు.

ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ(ఆన్‌ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకు డిప్యూటేషన్‌పై ప్రత్యేక కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

అమెరికాకు చెందిన వాల్ష్‌ కర్రా హోల్డింగ్స్‌ తెలంగాణలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఐదేండ్లలో వీ హబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

రుణ‌మాఫీ కానీ రైతుల‌కు అండ‌గా బీఆర్ఎస్.. 8374852619 నంబ‌ర్‌కు వాట్సాప్ చేయాల‌ని సూచ‌న‌.

నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం.. 16గేట్లు ఎత్తివేసిన అధికారులు.

పత్రికల్లో పనిచేసేవారికి అక్రెడిటేషన్‌ కార్డుల జారీలో పెద్ద పత్రికలు, చిన్న పత్రికల విభజనను హైకోర్టు తప్పుపట్టింది.

ANDHRA PRADESH NEWS

భద్రత కవరేజీపై హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్.. సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించారని ఆరోపణ.

చావుకి బతుక్కి మధ్య ఉన్న కాపాడండి ప్లీజ్‌.. దుబాయ్‌లో మరో మహిళ ఆవేదన.

గత ప్రభుత్వ ఇసుక పాలసీపై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు.

ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

ఏపీలో నిధుల కొరత చాలా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి రూ.27వేల కోట్లు రావాలని పేర్కొన్నారు..

NATIONAL NEWS

ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ సోమవారం తోసిపుచ్చారు.

కోచింగ్‌ సెంటర్లు ‘డెత్‌ చాంబర్లు’గా మారాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వక్ఫ్‌ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్‌ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా వక్ఫ్‌ చట్టం-1995 సవరించేందుకు మోదీ సర్కార్‌ రంగం సిద్ధం చేసింది. వక్ఫ్‌ చట్టం-1995 సవరణ బిల్లును రూపొందించింది.

జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌, పీడీపీ సోమవారం ‘బ్లాక్‌ డే’గా పాటించాయి.

రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు.. ఎగుమతి చేయడమే లక్ష్యంగా ఉండే 100 హార్టికల్చర్‌ క్లస్టర్లను రానున్న ఐదేళ్లలో ఏర్పాటు చేస్తామని రోడ్‌మ్యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

రాష్ర్టాన్ని విభజించే ఏ ప్రయత్నాన్ని అయినా వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

బీహార్‌లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్‌ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు.

జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఏసీ కొనాలంటే 50 మొక్కలు నాటాలి : రాజస్దాన్‌ సర్కార్‌ మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌.

బంగ్లాదేశ్‌ సంక్షోభం.. ఢాకాకు విమానాలను రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా, ఇండిగో.

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి వెళ్లేందుకు… గ్రూప్ కెప్ట‌న్ శుభాన్షు శుక్లాతో పాటు గ్రూప్ కెప్టెణ్ ప్ర‌శాంత బాల‌కృష్ణ‌న్ నాయ‌ర్ నాసా లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు.

ఫిజీ చేరుకున్న ద్రౌపది ముర్ము.. తొలిసారి ఆ దేశ పర్యటనకు వెళ్లిన భారత రాష్ట్రపతి.

కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన 133 మంది యాత్రికులను రక్షించిన ఐఏఎఫ్‌.

ప్రాణవాయువు (ఆక్సిజన్‌) స్థాయి తక్కువగా ఉన్నపుడు, మెదడులో తయారయ్యే రెండు రసాయనాలు రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఈ రసాయనాల్లో ఒకటి ఆక్సిటోసిన్‌ కాగా, మరొకటి కార్టికోట్రోపిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ (సీఆర్‌హెచ్‌).

INTERNATIONAL NEWS

బంగ్లాదేశ్‌లో చెల‌రేగుతున్న హింస కారణంగా ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామాతో సైన్యం దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతం కానున్నదనే అంచనాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

చైనాలో యువతీ, యువకులు వివాహ బంధంలో ప్రవేశించడానికి విముఖంగా ఉన్నారు. ఒకప్పుడు జనాభాను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పిల్లల్ని కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా యువత పట్టించుకోవడం లేదు.

BUSINESS NEWS

కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు. సెన్సెక్స్‌ 2,222, నిఫ్టీ 662 పాయింట్లు పతనం. ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్ల సంపద ఆవిరి. చుట్టుముట్టిన అమెరికా మాంద్యం భయాలు.
సెన్సెక్స్ : 78,759 (-2,222)
నిఫ్టీ : 24,055 (-662)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో భారత్‌ నుంచి 86 వ ర్యాంక్‌ను పొందిన సంస్థగా రిలయన్స్‌ చరిత్ర సృష్టించింది.

డాలర్‌తో పోలిస్తే మారకం విలువ సోమవారం ఒకేరోజు 37 పైసలు పడిపోయి 84.09 వద్ద ముగిసింది. 84కి పడిపోవడంతో ఫారెక్స్‌ మార్కెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన టాటా కర్వ్.ఈవీ కారుతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ నూ ఆవిష్కరించనున్నది.

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక‌ల్లో భార‌త ప‌తాక‌ధారిణిగా మ‌నూభాక‌ర్ వ్య‌వ‌హ‌రించనున్న‌ది. ఈ విష‌యాన్ని భార‌తీయ ఒలింపిక్ సంఘం అధికారి తెలిపారు.

కాంస్య ప‌త‌క పోరులో లక్ష్యసేన్ మలేషియా షట్ల‌ర్ లీ జిల్ జియా చేతిలో ఓడిపోయాడు.

స్కీట్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మ‌హేశ్వ‌రి చౌహ‌న్, అనంత్ జీత్ సింగ్ న‌రుక జోడీ ఒక్క పాయింట్‌తో కాంస్య ప‌త‌కం చేజార్చుకుంది.

రెజ్లింగ్ పోటీల్లో నిషా ద‌హియా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

టేబుల్ టెన్నిస్ మ‌నికా బ‌త్రా, ఆకుల శ్రీ‌జ‌, అర్చ‌నా కామ‌త్‌ ల టీమ్‌ క్వార్టర్స్ కు చేరింది.

సెమీస్‌కు ముందు భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ.. డిఫెండర్‌ రోహిదాస్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం.

దినేష్ కార్తిక్ దక్షిణాఫ్రికా 20(SA20) లీగ్‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

ఇంగ్లండ్ క్రికెట్ మాజీ ఆల్‌రౌండ‌ర్ గ్రాహ‌మ్ థోర్పె క‌న్నుమూశాడు.

బంగ్లాదేశ్‌లో అల్ల‌రి మూకలు చెల‌రేగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న ముష్ర‌ఫే ముర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు.

EDUCATION & JOBS UPDATES

ముగిసిన తెలంగాణ డీఎస్సీ రాత పరీక్షలు.

తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌(టామ్‌కామ్‌) ఆధ్వర్యంలో జపాన్‌లో నర్సింగ్‌ ఉద్యోగాల్లో చేరేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వివరాలకు 9951909863, 9573945684 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఫూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది.

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్న అభ్య‌ర్థుల కోసం టీ-శాట్ ప్ర‌త్యేక పాఠాలు ప్ర‌సారం చేయ‌నుంది. మెయిన్స్ ప‌రీక్ష‌ల నిమిత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది.

ENTERTAINMENT UPDATES

హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో నిర్మించిన సెట్‌లో ఈ సినిమా పతాక సన్నివేశాలను దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు.

అనుమతి లేకుండా తన పాటల్ని ఎవరైనా వాడుకుంటే వాళ్లపై లీగల్‌గా యాక్షన్‌ తీసుకుంటున్నారు లెజెండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు