Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 01 – 2025

BIKKI NEWS (JAN. 05) : TODAY NEWS IN TELUGU on 5th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th JANUARY 2025

TELANGANA NEWS

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే పరిధిలో రూ.413 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించనున్నారు.

రాష్ట్రంపై చలిపంజా.. వచ్చే మూడ్రోజులు మరింత పెరగనున్న చలి

ఏడంతస్తులు నేలమట్టం.. మాదాపూర్‌ ఖానామెట్‌లో విరుచుకుపడ్డ హైడ్రా

జెన్‌కో అసిస్టెంట్‌ ఇంజినీర్లు, కెమిస్ట్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సోమవారం నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం

ANDHRA PRADESH NEWS

వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. మాధవీలతకు క్షమాపణలు

సినిమా టికెట్ల ధర పెంపుతో జీఎస్టీ రూపంలో ఖజానాకు ఆదాయం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ప్రభుత్వానికి నష్టం కలిగిస్తే నా పిల్లలైనా నా ఊరుకోను – హోంమంత్రి అనిత

మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం – హైందవ శంఖారావం తీర్మానం

NATIONAL NEWS

చైనా HMVP వైరస్‌లపై ఆందోళన వద్దు.. ప్రజలకు కేంద్రం భరోసా

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం.. చైనా బ్రహ్మపుత్ర ప్రాజెక్టుపై భారత్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలు సాధిస్తున్నది. గత నెల 30న ప్రయోగించిన పీఎస్‌4-ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ మాడ్యూల్‌ (పీఓఈఎం)లో బొబ్బర గింజలు (కౌపీ సీడ్స్‌) మొలకెత్తాయి.

అమెరికా జారీ చేసిన హెచ్‌1బీ వీసాలలో ఐదో వంతు భారత్‌కు చెందిన టెక్‌ కంపెనీలు దక్కించుకున్నాయి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు.

ఇక నుంచి పెండ్లి కాని జంటలకు రూమ్‌లను అద్దెకు ఇవ్వమని ప్రముఖ హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయో ప్రకటించింది.

INTERNATIONAL NEWS

లండన్‌లో బ్రిటన్‌ పౌరుల కంటే అధిక ఆస్తులు భారతీయులకే, తాజా నివేదిక వెల్లడి.

యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌గా మైక్‌ జాన్సన్‌ ఎన్నిక.. ఇద్దరు ప్రతిపక్ష నేతల మద్దతు

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్‌ మహిళ టోమికో ఇతోకా మృతి చెందినట్టు శనివారం అధికారులు ప్రకటించారు.

BUSINESS NEWS

ఒకేసారి పలు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునేవారికి సెంట్రల్‌ బ్యాంక్‌ పరిమితులు విధించింది.

SPORTS NEWS

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం. సిరీస్‌ 3-1తో కైవసం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు