BIKKI NEWS (DEC 31) : TODAY NEWS IN TELUGU on 31st DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 31st DECEMBER 2024
TELANGANA NEWS
దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి స్థానంలో నిలిచారని ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది.
భారతరత్నం మన్మోహన్.. దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తుది ఓట్ల జాబితాను వెల్లడించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి.
రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో ఏఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు పొన్నం, సీతక్క సూచించారు.
ANDHRA PRADESH NEWS
సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు. రూ.931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం. అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమత. వెల్లడించిన ఏడీఆర్-ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక
తెలంగాణ సీఎం రేవంత్ బాగా పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉగాది నుండి ఉండవచ్చని సమాచారం.
ఫిబ్రవరి 1 నుండి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
NATIONAL NEWS
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ(ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్) ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్‌ఎల్వీ)-సీ60 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్‌డీఎక్స్01(చేజర్), ఎస్‌డీఎక్స్02(టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను ఈ వాహకనౌక నిర్ణీత భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
హిందూ దేవాలయ పూజారులకు, గురుద్వారా గ్రంథిలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం చెల్లిస్తామని కేజ్రీవాల్ పార్టీ ఆప్ వాగ్దానం చేసింది.
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ స్వీకరించబోతున్నారు.
సీఎం ఆదిత్యనాథ్ నివాసం కింద శివలింగం ఉంది: అఖిలేష్ యాదవ్
రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు సోమవారం పంజాబ్ బంద్. 163 రైళ్లు రద్దు
INTERNATIONAL NEWS
ఈ ఏడాదిలో(2024) ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. న్యూ ఇయర్ నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్(100) కన్నుమూశారు
సౌర వ్యవస్థను దాటి వెళ్లగలిగే సామర్థ్యంతో ఒక అధునాతన పునర్వినియోగ వ్యోమనౌకను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్నది.
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 78,248.13 (-450.94)
నిఫ్టీ : 23,644.90 (-168.50)
భారీగా బీమా క్లెయింల తిరస్కరణ.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి ఆసుపత్రులు షాక్
SPORTS NEWS
బోర్డర్ – గవాస్కర్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. 340 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
2024 ఏడాదికి గాను ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్‌లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా కు చోటు దక్కింది.
సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీలో రంగారెడ్డి ఓవరాల్ విజేతగా నిలిచింది.
EDUCATION & JOBS UPDATES
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ జనవరి 2 నుంచి ప్రారంభమవుతుంది.
సీటెట్ కీ జనవరి 2 న విడుదల
పీజీ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 05
- శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ