Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 08 – 2024

BIKKI NEWS (AUG 29) : TODAY NEWS IN TELUGU on 29th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th AUGUST 2024

TELANGANA NEWS

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా చేపడుతున్న చర్యలన్నీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు తేల్చిచెప్పింది.

ప్రజల ప్రయోజనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్‌ అన్నారు. చెరువుల్లో నిర్మాణాలు ఉంటే ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టంచేశారు

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మిలియన్‌ మార్చ్‌ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువచ్చని అంచనా వేసింది.

తెలంగాణ, ఏపీలో జిల్లా లు, మండలాలు, గ్రామాల వారీగా ఉన్న జనాభాతోపాటు ఏడాదిపాటు తాగునీటి కోసం ఎన్ని నీళ్లు అవసరమన్న వివరాలను ప్రాజెక్టులవారీగా అందజేయాలని కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ర్టాలకు సూచించింది.

రాష్ట్రంలోని 5 జిల్లాల్లో భారీగా సున్నపురా యి (లైమ్‌స్టోన్‌), గ్రానైట్‌ నిల్వలు ఉన్నట్టు తె లంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) గు ర్తించింది. సూర్యాపేట, వికారాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి గనులు.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వివిధ రకాల గ్రానైట్‌ నిల్వలు ఉన్నట్టు వెల్లడించింది.

రీజినల్‌ రింగు రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగ అలైన్‌మెంట్‌లో మరిన్ని మార్పులను సూచించారు.

రేషన్‌కార్డు లేని రైతులందరికీ రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టంచేశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీని ఏర్పాటు చేయనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) ఇందుకు ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోఆర్డినేషన్‌ కమిటీ నేతలు డాక్టర్‌ ధర్మతేజ, డాక్టర్‌ ఉపేందర్‌, డాక్టర్‌ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

మోహదీపట్నం నుంచి అత్తాపూర్‌ ‘మొగల్‌ కానాలా’లో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్‌ ఆయిల్‌, గంజాయిని పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసు కుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు

ANDHRA PRADESH NEWS

వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ఏపీ కేబినెట్‌ రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది

పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్‌ ఫొటో తొలగించి.. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్‌ పుస్తకాలను ఇచ్చేందుకు కేబినెట్‌ నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్‌ షాపుల ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది

పోలవరంకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం

వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

NATIONAL NEWS

బెంగాల్‌ తగలబడితే, తర్వాత అస్సాం, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

తెలంగాణలోని జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్‌ సిటీలు కొలువు తీరనున్నాయి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొందరు వ్యక్తులు ఆవులను నదిలోకి తోసేశారు.

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు వెల్లడవుతున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు పలకాలని కూటమి నేతలు పీడీపీని కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్లను యూపీ సర్కారు రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్‌మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు రూ.8 లక్షల వరకు ఆర్జించవచ్చు.

గత వారం ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేసింది

యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం కంటే భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఫిక్కరీ రోడ్‌ సేఫ్టీ అవార్డ్స్‌ – కాన్‌క్లేవ్‌ 2024 ఆరో ఎడిషన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కూతుళ్లు, అక్కాచెల్లెళ్లపై ఇలాంటి వేధింపులు జరగడం ఏ నాగరిక సమాజం అనుమతించబోదని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.

దేశంలో వాయు కాలుష్యం 2022లో 19.3 శాతం తగ్గింది. ఆ ఏడాది ప్రపంచంలో బంగ్లాదేశ్‌ తర్వాత భారత్‌లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఏడాదిపాటు పెరిగిందని షికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎపిక్‌) తాజాగా విడుదల చేసిన ‘ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌-2024’ నివేదికలో వెల్లడించింది.

కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా రజ్విందర్‌ సింగ్‌ భట్టి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) చీఫ్‌గా దల్జీత్‌ సింగ్‌ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది.. 76 పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పీఎంఎల్ఏ కేసులో.. బెయిల్ ఇవ్వ‌డం రూల్ అని, జైలుశిక్ష మిన‌హాయింపు అవుతుంద‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ గ‌వాయి, జ‌స్టిస్‌కేవీ విశ్వ‌నాథ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది.

గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కుప్పకూలిన బ్రిడ్జ్‌.

ఉత్తర ప్రదేశ్ లో తోడేళ్లు విజృంభిస్తున్నాయి. గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. ఇళ్లలోని పసి పిల్లలను ఎత్తుకుపోయి చంపి తింటున్నాయి. తోడేళ్ల దాడుల్లో గత రెండు నెలల్లో ఏడుగురు పిల్లలు, ఒక మహిళ సహా 8 మంది మరణించారు

తమిళనాడుకు చెందిన అధికార పార్టీకి ఎంపీకి ఈడీ భారీ షాక్‌ ఇచ్చింది. ఆయన, కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీ ఎస్‌ జగత్రక్షకన్‌ ఆయన కుటుంబ సభ్యులకు రూ.908కోట్ల జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం తెలిపింది.

INTERNATIONAL NEWS

రష్యాలో 100 స్థావరాలను ఆక్రమించాం – జెలన్‌స్కీ

ఇజ్రాయెల్ మ్యూజియం లో బాలుడు పడవేయడంతో 3000 ఏళ్ల నాటి జాడీ పగిలింది.

BUSINESS NEWS

ఆల్‌టైమ్‌ హైకి నిఫ్టీ.. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్ : 81,785 (74)
నిఫ్టీ : 25,052 (35)

ఎస్బీఐని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో కొత్త చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం తాత్కాలిక చైర్మన్‌లను ప్రకటించింది.

కేంద్రం ఎడిబుల్‌ ఆయిల్స్‌ దిగుమతిపై సుంకం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వంటనూనెల ధరలు పెరగనున్నాయి.

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ (ఎక్స్‌) సర్వర్‌ డౌన్‌ అయ్యింది

టీవీఎస్‌ మరో మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. 110 సీసీ సామర్థ్యంతో రూపొందించిన జూపిటర్‌ సరికొత్త వెర్షన్‌ ధర రూ.77 వేలు ప్రారంభ ధరగా నిర్ణయించింది.

SPORTS NEWS

గతానికి పూర్తి భిన్నంగా పారిస్‌ నడిబొడ్డున జరిగిన పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకలు జరిగాయి. భారత పతాకధారులుగా సుమిత్‌, భాగ్యశ్రీ.

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఐసీసీ బుధవారం టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టాప్‌-10లో ముగ్గురు భార బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. రోహిత్ 6వ, జైశ్వాల్ 7వ, కోహ్లీ 8వ స్థానంలో నిలిచారు.

టెస్టు క్రికెట్‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ కొత్త చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పురోగ‌తికి అడ్డుగా నిలిచిన అన్ని అవ‌రోధాల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన గ్రేగ్ బార్‌క్లే నుంచి ఐసీసీ చైర్మెన్ బాధ్య‌త‌ల‌ను జే షా స్వీక‌రించ‌నున్నారు.

5 గంట‌ల 35 నిమిషాల పాటు ఇవాన్స్ పోరాడాడు. ఓట‌మి అంచు నుంచి ఆ బ్రిటీష్ టెన్నిస్ ప్లేయ‌ర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ కొట్టాడు. యూఎస్ ఓపెన్ చ‌రిత్ర‌లో అది సుదీర్ఘ టెన్నిస్ మ్యాచ్‌గా నిలిచింది. 6-7 (6/8), 7-6 (7/2), 7-6 (7/4), 4-6, 6-4 స్కోరుతో ర‌ష్య‌న్‌ను ఓడించాడు.

EDUCATION & JOBS UPDATES

TGPSC – లైబ్రేరియన్ రెండో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 31న. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 02 వరకు వెబ్ ఆప్షన్స్ ఆవకాశం.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లు, 449 కాంట్రాక్ట్‌, 53 పార్ట్‌ టైం హవర్లీ, 43 పార్ట్‌ టైం కన్సాలిడేట్‌, 3 మినిమం టైం సేల్‌ లెక్చరర్లు, 78 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగిస్తూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది.

గేట్ 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

యూనియన్ బ్యాంకు లో 500 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో 550 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్

త్వరలోనే CSIR UFC NET 2024 ఫలితాలు

ENTERTAINMENT UPDATES

తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను తెరకెక్కించనుంది

మ‌ల‌యాళం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో వేధింపులు.. 17 కేసులు న‌మోదు

సీనియర్‌ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు