నీటిపారుదల శాఖలో ఏఈఈ పోస్టుల భర్తీ కొరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (AUG. 29) : AEE POSTS CERTIFICATE VERIFICATION BY IRRIGATION DEPARTMENT. రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల(ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతల పత్రాలను ఈనెల 31 నుంచి సెప్టెంబరు మూడు వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆ శాఖ ఈఎన్సీ జి. అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

AEE POSTS CERTIFICATE VERIFICATION BY IRRIGATION DEPARTMENT

హైదరాబాద్‌లోని ఇర్రంమంజిల్‌ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన జరగనుంది.

ఆగస్టు 31న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సివిల్‌ అభ్యర్థులు (మల్టీజోన్‌-1), సెప్టెంబరు 2న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మెకానికల్‌ (మల్టీజోన్‌-1 అండ్‌ 2), ఉదయం 9:30 గంటల మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎలక్ట్రికల్‌ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.

అలాగే సెప్టెంబరు 2న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (మల్టీజోన్‌-1 అండ్‌ 2) అగ్రికల్చర్‌ అభ్యర్థుల పత్రాలను తనిఖీ చేస్తారు.

సెప్టెంబరు 3న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (మల్టీజోన్‌-1 అండ్‌ 2) సివిల్‌ అభ్యర్థుల విదార్హతలను పరిశీలిస్తారు.

పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్‌/ డిప్లొమో సర్టిఫికెట్‌, డిగ్రీ, కమ్యూనిటీ, స్టడీ, టీజీపీఎస్సీ హాల్‌టికెట్‌, వికలాంగుల ధృవపత్రం (అర్హత ఉంటేనే), ఈడబ్ల్యూఎస్‌ సర్టిపికెట్‌ (ఓరిజినల్‌) అందచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులంతా విద్యార్హత, ఇతర పత్రాలకు సంబంధించి ఒక జిరాక్స్‌ సెట్‌ను సమర్పించాలని ఈఏన్సీ అనిల్‌కుమార్‌ సూచించారు.

ఇతర వివరాల కోసం 9502500322, 9704314566 నెంబర్లల్లో సంప్రదించాలని గురువారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు