TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 07 – 2024

BIKKI NEWS (JULY 27) : TODAY NEWS IN TELUGU on 27th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 27th JULY 2024

TELANGANA NEWS

రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ధరణి సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చట్టాన్ని తేవాలని సీఎం నిర్ణయం.

జీవో నెంబర్ 317 తో అన్యాయం జరిగినట్లు తేలితేనే ఉద్యోగులకు న్యాయం చేస్తాం. మంత్రివర్గ ఉప సంఘం స్పష్టీకరణ

రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు

గోల్కొండ కోట‌లో పంద్రాగ‌స్టు వేడుక‌లు.. సీఎస్ శాంతి కుమారి స‌మీక్ష‌

కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

ANDHRA PRADESH NEWS

హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్‌ డైరెక్షన్‌లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ , మండలి సమావేశాలు నిరవధిక వాయిదా

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు.

రెడ్‌బుక్‌ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు : మంత్రి నారా లోకేష్‌

NATIONAL NEWS

జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

అన్ని రకాల ఆన్‌లైన్‌ వార్తలు, వార్తా సంబంధిత కంటెంట్‌, వీడియోలు, వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా కామెంటరీని సైతం చట్టపరిధిలోకి తీసుకురానున్నది. ఇందుకు సంబంధించి బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్‌ (రెగ్యులేషన్‌) బిల్లు-2024 పేరుతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.

పశ్చిమబెంగాల్‌ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్‌ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ వస్తున్న డిమాండ్లపై తీవ్ర నిరసన.

గడచిన ఐదేండ్లలో ఏనుగుల దాడుల్లో 2,853 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

గత ఐదేండ్లలో దేశంలో 628 పులులు చనిపోయినట్టు కేంద్రం తెలిపింది.

తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు నీతి ఆయోగ్ భేటీ కి గైర్హాజర్ అయ్యో అవకాశం.

అస్సాంలోని అహోం రాజ వంశానికి చెందిన మట్టి సమాధులు ‘మొయిడమ్స్‌’ను శుక్ర వారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు

యూపీ సీఎం యోగి సమావేశాలకు ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రిజేష్‌ పాఠక్‌ గైర్హా జరవుతుండటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్‌లో ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. లోక్‌సభకు వెల్లడించిన జేపీ నడ్డా

ద్రాస్ సెక్టార్‌లో ఇవాళ 25వ కార్గిల్ విజ‌య్ దివ‌స్‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ.. షింకున్ లా ట‌న్నెల్ ప్రాజెక్టు ప‌నుల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

INTERNATIONAL NEWS

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ పదవి కోసం పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పోటీ చేయబోతున్నారు.

భారత్‌తో సంబంధాలు చాలా కీలకం.. పాక్‌కు సాయాన్ని నిషేధించాలి.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

సెర్చ్‌జీపీటీ’ పేరుతో సెర్చ్‌ఇంజిన్‌ను తీసుకొస్తున్నట్లు చాట్ జీపీటి ప్రకటించింది.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,333 (1293)
నిఫ్టీ : 24,835 (429)

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు స్టార్‌ క్యాచర్‌ ఇండస్ట్రీస్‌ స్టార్టప్‌ ముందుకొచ్చింది

ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.

మూడు రేట్ల శ్లాబ్లలోకి జీఎస్టీ స్ట్రక్చర్.. తేల్చి చెప్పిన సీబీఐసీ చైర్మన్

SPORTS NEWS

మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్‌ జట్టు వరుసగా 9వ ఎడిషన్‌లోనూ ఫైనల్‌ చేరింది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది.

ఆసియా కప్ 2024 ఫైనల్ లో తలపడనున్న భారత్ & శ్రీలంక మహిళల జట్టు

నేడు టీమిండియా, శ్రీలంక మొదటి టీట్వంటీ మ్యాచ్. రాత్రి 7.00 గంటలకు సోని టీవీ లో

చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించింది.

EDUCATION & JOBS UPDATES

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.. కేవలం 17 మందికి మాత్రమే టాప్ ర్యాంక్ దక్కింది.

డెహ్రాడూన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి ప్రవేశాల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు