BIKKI NEWS (NOV. 26) : TODAY NEWS IN TELUGU on 26th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th NOVEMBER 2024
TELANGANA NEWS
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో భాగంగా నేడు బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జేఎల్ ఎకనామిక్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎకనామిక్స్, ఎకనామిక్స్(ఉర్దూ మీడి యం) పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించింది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సోమవారం కొట్టివేసింది.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ 19 నుంచి నిరవధిక బంద్‌ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం కాస్త వెనక్కి తగ్గింది
ఆర్‌ఆర్‌బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే సమయంలో రెండు పరీక్షలుండటంతో ఆందోళన చెందుతున్నారు.
సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ANDHRA PRADESH NEWS
అమరావతి నిర్మాణం కొసం మరో 16 వేల కోట్ల రుణం
నరసాపురం లేస్ ను జీఐ ట్యాగ్ గుర్తింపు లభించింది.
నవంబర్ 29 న జరగాల్సిన ప్రధానమంత్రి వైజాగ్ పర్యటన వాయీ.
పవన్ దగ్గర మెహర్బానీ కోసమే.. జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు.. బాలినేనిపై మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం
జగన్ 1750 కోట్లు లంచం తీసుకోకుంటే.. అర్ధరాత్రి అనుమతులు ఎందుకిచ్చారు.. వైఎస్ షర్మిల సుదీర్ఘ లేఖ
NATIONAL NEWS
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బుధవారానికి వాయిదా పడ్డాయి.
రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని పిటిషన్లు తిరస్కరిస్తూ… ‘సుప్రీం’ కీలక తీర్పు
పాన్ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేయాలని, ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై వీడని సస్పెన్స్. పడ్నవీస్ లేదా ఎక్ నాథ్ షిండే లలో ఎవరికి అదృష్టం దక్కేనో.
అండమాన్ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి.
భూగర్భ జలాలను మానవాళి అమితంగా తోడేయడం వల్ల భూభ్రమణ అక్షం 31.5 అంగుళాల (దాదాపు 80 సెంటీమీటర్ల) మేరకు వంగిపోయిందని, ఇది భూభ్రమణంలో మార్పునకు, సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీసిందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా మిగిలిన నగరాల్లో సీఎన్‌జీ ధర పెరిగింది. కిలో సీఎన్‌జీకి రూ.2 చొప్పున పెంచారు.
ఐసీఎస్‌ఈ(10వ తరగతి), ఐఎస్‌సీ(12వ తరగతి) పరీక్షల డేట్‌షీట్లను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్‌సీఈ) సోమవారం విడుదల చేసింది.
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ.. విద్యాసంస్థలు ప్రారంభించాలని అడ్వైజ్
INTERNATIONAL NEWS
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవా గ్యాలంట్‌లకు అరెస్ట్ వారెంట్ జారీచేయటం కాదు, వారికి మరణ శిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావటంతో హఠాత్తుగా భారత్‌ను వీడి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని లలిత్ మోదీ అన్నారు.
నాలుగు ఫ్యామిలీ ఫౌండేషన్స్‌కు రూ.9,604 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వారెన్ బఫెట్ ప్రకటించారు.
ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అదుపులోకి తీసుకున్న అరెస్ట్ చేసిన బంగ్లా ప్రభుత్వం
BUSINESS NEWS
మళ్లీ 80 వేల పైకి సెన్సెక్స్
సెన్సెక్స్ : 80,110 (993)
నిఫ్టీ : 24,222 (315)
గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి పూర్తిగా ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రియల్టర్ల సంఘం క్రెడాయ్ కోరింది.
దేశ రాజధానిలో బంగారం తులం ధర రూ.1000 క్షీణించి రూ.79,400లకు పడిపోయింది.
ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజ సంస్థ టోటల్ ఎనర్జీస్ ఎస్‌ఈ అదానీ గ్రూప్ సంస్థల్లో ఇకపై కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని సోమవారం ప్రకటించింది.
SPORTS NEWS
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాదించింది. సిరీస్ లో 1-0 తో ముందంజలో ఉంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా బుమ్రా నిలిచాడు.
పెర్త్ టెస్టులో ఘనవిజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ డింగ్ లిరెన్ పై ఓటమితో ఆరంభించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్.. నైజీరియాతో మ్యాచ్ లో 7 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఫీజు గడువు పెంపు
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జేఎల్ ఎకనామిక్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎకనామిక్స్, ఎకనామిక్స్(ఉర్దూ మీడి యం) పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించింది.
ఫిబ్రవరి 18 నుంచి ఐసీఎస్‌ఈ పరీక్షలు.
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్