TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 08 – 2024

BIKKI NEWS (AUG 25) : TODAY NEWS IN TELUGU on 25th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th AUGUST 2024

TELANGANA NEWS

హైడ్రా పరిధిని 111 జీవో పరిధి గ్రామాల వరకు వర్తింపజేయనున్నట్టు తెలుస్తున్నది. దీనికోసం నేడో, రేపో ఆర్డినెన్స్‌ కూడా జారీ చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సైబర్‌ మోసాల వల్ల హైదరాబాద్‌ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌ పేరిట ప్రభుత్వ భూమి ఉన్నట్టు 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని, 2023 అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదని ఎక్స్‌ వేదికగా భరత్‌ అనే నెటిజన్‌ పోస్టు చేశారు.

టార్గెట్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అనురాగ్‌, గాయత్రి విద్యా సంస్థలపై కేసు

రాష్ట్రం డెంగ్యూ కోరల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 నాటికి ఏకంగా 5,246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 శాతం కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే వెలుగు చూశాయి.

హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌ పరిధిలో ఉన్న తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లోని అనధికారిక నిర్మాణాలను శనివారం హైడ్రా కూల్చేసింది.

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన గంటకే ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత అత్యవసరంగా ఎందుకు కూల్చివేశారని నిప్పులు చెరిగింది.

మేడ్చల్‌ మలాజిగిరి జిల్లా, కొర్రేముల (వెంకటాపూర్‌) గ్రామం, నాదం చెరువు సమీపంలో అనురాగ్‌ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది.

ఎస్టీ గురుకుల టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిలో చనిపోయాడు.

ANDHRA PRADESH NEWS

జగన్‌ ఆలోచనలను అంచనా వేయలేం.. అతను మామూలోడు కాదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైసీపీ తరపున రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం : మాజీ మంత్రి బొత్స

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో సైన్స్‌ ల్యాబ్‌లో విష వాయువులు వెలువడిన ఘటనలో 24 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.

ఆగస్టు 28న తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర స్వామి వారి కానుకలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు

స్విమ్స్ దవాఖానలో వైద్యురాలిపై చేయి చేసుకున్న రోగిపై చర్య తీసుకోవాలని స్విమ్స్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు.

NATIONAL NEWS

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి. హక్కులు, డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్‌ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు(సీటీయూ) శుక్రవారం ప్రకటించాయి.

ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌) పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్‌ రూపంలో అందుతుంది.

వాల్మీకి స్కామ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

విజ్ఞాన్‌ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్‌ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది.

2026 మార్చినాటికి నక్సల్‌ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్‌ ఆపరేషన్స్‌పై జరిగిన సమావేశం అనంతరం శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

భారత్‌లో తొలి పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌ ‘రుమీ-2024’ను తమిళనాడు స్టార్టప్‌ కంపెనీ ‘స్పేస్‌ జోన్‌ ఇండియా’ శనివారం ప్రయోగించింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

మైనారీటీలను లక్ష్యంగా చేసుకోవడం, బుల్డోజర్లను ఉపయోగించడం ఆందోళనకరం: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు.

జ‌మ్మూక‌శ్మీర్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 88 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్న‌ట్లు చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ పీకే పోల్ తెలిపారు

బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని వై-క్రోమోజోమ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్‌లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

INTERNATIONAL NEWS

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ మేరకు శనివారం నాసా కీలక ప్రకటన చేసింది.

భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్‌ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా తెలిపింది

చైనా డ్రోన్ల ద్వారా ఆహార డెలివరీని ప్రారంభించింది. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనాను సందర్శించేవారికి ఫుడ్‌ డెలివరీ దిగ్గజం మెయిటువాన్‌ ఈ సేవలు అందించనుంది.

BUSINESS NEWS

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించడానికి రిజర్వుబ్యాంక్‌కు వీలు పడనున్నట్లు ద్రవ్యపరపతి సమీక్ష(ఎంపీసీ) సభ్యుడు జయంత్‌ వర్మ వెల్లడించారు

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..వచ్చే ఏడాది కాలంలో మరో ఐదు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 2024 జనవరి- జూలై మధ్య 1,26,000 కార్లు విక్రయించింది.

గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’లో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న భారత సంతతి అమెరికన్ శ్రీలా వెంకటరత్నం కంపెనీ నుంచి వైదొలిగారు.

SPORTS NEWS

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లా.. ఆతిథ్య జట్టుకు దీటైన జవాబిచ్చింది

భారత్‌లో రేసింగ్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) శనివారం చెన్నైలో అట్టహాసంగా మొదలైంది.

EDUCATION & JOBS UPDATES

బీసీ గురుకుల ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో యానిమేషన్‌ కోర్సులో ప్రవేశాలకు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సెక్రటరీ సైదులు శనివారం ప్రకటనలో వెల్లడించారు.

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంటర్నల్‌ స్లైడింగ్‌లో 5,579 మంది విద్యార్థులు సీట్లు మార్చుకున్నట్టు టీజీ ఎప్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ శ్రీదేవసేన శనివారం ప్రకటనలో తెలిపారు. 5,579 మందికి సీట్లు మార్చామని సీట్లు పొందిన వారు నేడు రిపోర్టు చేయాలని సూచించారు.

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంటర్నల్‌ స్లైడింగ్‌ తర్వాత 11,836 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు.

తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పీహెచ్డీ అడ్మిషన్స్

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ లో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్స్

AGRICET 2024 HALL TIKETS విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

CISF లో ఇంటర్ తో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

NEET PG 2024 RESULTS విడుదల

GATE 2025 నోటిఫికేషన్ విడుదల.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు