Home > LATEST NEWS > TODAY NEWS > TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 06 – 2024

TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 06 – 2024

BIKKI NEWS (JUNE 22) : TODAY NEWS IN TELUGU on 22nd JUNE 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా వార్తల సమాహారం ఒకే చోట మీకోసం

TODAY NEWS IN TELUGU on 22nd JUNE 2024.

TELANGANA NEWS

రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ కొరకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రైతు భరోసా విధి విధానాల ఏర్పాటు కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది.

సింగరేణికి నేరుగా బొగ్గు కన్నులు కేటాయి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతానని కిషన్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ గూటికి చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. 20 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని దానం నాగేందర్ ప్రకటన.

ప్రతిపక్ష నాయకులను కేసులతో వేధిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు.

ANDHRA PRADESH NEWS

కొలువుదీరిన నూతన అసెంబ్లీ. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకాతిరుమల రావు బాధ్యతలు స్వీకరణ

NATIONAL NEWS

నీట్ 2024 కౌన్సిలింగ్ వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

యోగాతోనే ప్రపంచ శ్రేయస్సు ముడిపడి ఉంది. ప్రధాని మోడీ.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ బెయిల్ పై హైకోర్టు స్టే.

పరీక్ష పేపర్ల లీక్ చేస్తే కోటి రూపాయల వరకు జరిమానా మరియు పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే నూతన చట్టం అమల్లోకి వచ్చింది.

హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

INTERNATIONAL NEWS

గ్రాడ్యుయేట్ అయితే నేరుగా గ్రీన్ కార్డు అందజేస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ సంచలన ప్రతిపాదన.

నిరాశ్రయుల గుడారాలపై ఇజ్రాయోల్ భీకర దాడి, 25 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు.

BUSINESS NEWS

సెన్సెక్స్ 220 పాయింట్లు కోల్పోయి 77,210 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయి 23,501 ఒక్క పాయింట్ల వద్ద స్థిరపడింది

త్వరలో పబ్లిక్ ఇష్యూకు జెప్టో రానుంది.

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన జెరోధా సేవలు.

హిందూజా కుటుంబ సభ్యులలో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ స్విట్జర్లాండ్ కోర్టు తీర్పు చెప్పింది.

జిఎస్టి రేట్ల హేతుబద్దీకరణ కమిటీ చైర్మన్ గా బీహార్ ఉపముఖ్యమంత్రి నియామకం

SPORTS NEWS

ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది ఇది సూపర్ 8 సఫారీలకు రెండో విజయం. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ కామెంట్స్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం

అలాగే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

టి20 ప్రపంచ కప్ లో భారత్ నేడు బంగ్లాదేశ్ తలపడనుంది.

యూరో ఫుట్ బాల్ కప్ లో స్పెయిన్ నాకౌట్ దశకు చేరింది

ENTERTAINMENT UPDATES

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు