BIKKI NEWS (JAN. 01) : TODAY NEWS IN TELUGU on 1st JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st JANUARY 2025
TELANGANA NEWS
పారడైజ్ టూ మేడ్చల్, జేబీఎస్ టూ శామీర్‌పేట వరకు మెట్రో విస్తరణ కు మరో ముందడుగు. డిపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు.
విధుల్లో నిర్లక్ష్యం.. యాదాద్రి జిల్లాల్లో 16 మంది టీచర్ల సర్వీస్ తొలగింపు
రేపట్నుంచి టీజీ టెట్ – 2024 పరీక్షలు
సంక్రాంతి పండుగకు 6432 ప్రత్యేక బస్సులు
రాష్ట్రంలో పెద్దపులుల గాండ్రింపులు.. 13కు పైగా జిల్లాల్లో సంచారం
సచివాలయంలో ఫేసియల్ రికగ్నైజేషన్ హజరు అమలు
ఇలాగైతే హైడ్రా కమిషనర్‌ను మళ్లీ కోర్టుకు పిలిపిస్తాం.. ఖాజాగూడ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించింది
ANDHRA PRADESH NEWS
సెకీ వ్యవహారం మరో లడ్డు విషయం ల ఉంది – చంద్రబాబు.
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ప్రారంభం.. ఒకరికి తీవ్రగాయాలు
సంపద బదులు..అప్పులు సృష్టిస్తున్నారు : ట్విటర్‌లో కూటమిపై వైసీపీ ఆరోపణ
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
పేర్నినాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు
NATIONAL NEWS
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..
- డీఏపీపై సబ్సిడీ పెంపు
- ‘ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ’కి కేంద్రం రూ.800 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది
- పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది.
- నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
భారత్ నుంచి ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతంతో చైనా కొత్త కౌంటీ ఏర్పాటు. సరిహద్దు చర్చల వేళ దుందుడుకు చర్య.
మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కేరళను మినీ పాకిస్థాన్‌గా సంబోధించడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మంగళవారం ఖండించారు.
వివేకానంద స్మారక స్థలి నుంచి తిరువళ్లువర్ విగ్రహం వరకు దేశంలోనే తొలి గాజు వంతెన ద్వారా పర్యాటకులు చేరుకోవచ్చు
1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వెల్లడించింది.
INTERNATIONAL NEWS
హమస్ కమాండర్ అబ్దల్ హదీ సబాను హతమార్చిన ఇజ్రాయెల్.
అంటార్కిటికాపై రష్యా కన్ను.. మంచు ఖండంలో అపార చమురు నిక్షేపాలు
ఎలాన్ మస్క్ తన పేరును ‘కేకియస్ మాక్సిమస్’ గా మార్చుకున్నారు
BUSINESS NEWS
లాభాలతో ప్రారంభమైన నూతన సంవత్సరం
సెన్సెక్స్ : 78,507.41 (368.40)
నిఫ్టీ : 23,742.90 (98.10)
డిసెంబర్ 2024 జీఎస్టీ వసూళ్లు 1.77 లక్షల కోట్లు
యూపీఏ పేమెంట్స్ డిసెంబర్ 2024లో రూ.23.25 లక్షల కోట్లకు లావాదేవీలు.
వాట్సాప్ యూజర్లకూ పేమెంట్ సేవలు.. పరిమితులు ఎత్తేసిన ఎన్పీసీఐ.
చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చిన్న మొత్తాలపై వడీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
జనవరి 15 వరకూ బీ లేటెడ్ ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు..
SPORTS NEWS
దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ సంతోశ్ ట్రోఫీని పశ్చిమ బెంగాల్ రికార్డు స్థాయిలో 33వ సారి గెలుచుకుంది. ఫైనల్ లో 1-0తో మాజీ చాంపియన్ కేరళను ఓడించింది.
ముంబై యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే లిస్ట్ ‘ఏ’ క్రికెట్‌లో అతి పిన్న వయసులోనే 150 ప్లస్ స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
EDUCATION & JOBS UPDATES
రేపటి నుంచి తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షలు
జనవరి 12 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాబ్ కేలండర్ విడుదల
CSIR UGC NET 2024 (DEC) దరఖాస్తు గడువు జనవరి 02 వరకు పొడిగింపు.
IBPS CLERK MAINS RESULTS విడుదల
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 05
- శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ