Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 10 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 10 – 2024

BIKKI NEWS (OCT. 19) : TODAY NEWS IN TELUGU on 19th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 19th OCTOBER 2024

TELANGANA NEWS

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ. 100 కోట్ల విరాళం ఇచ్చింది.

గ్రూప్‌-4 తుది ఫలితాలు ఇవ్వక ముందే అన్‌విల్లింగ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పలువురు అభ్యర్థులు హైదరాబాద్‌ గాంధీభవన్‌ను ముట్టడించారు.

9 యూనివ‌ర్సిటీల‌కు వీసీల నియామ‌కం.. ఓయూ వైస్ ఛాన్స‌ల‌ర్‌గా కుమార్

అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొ ఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేశ్‌, కే జ్యోత్స్న శివారెడ్డిని కమిషన్‌ సభ్యులుగా నియమించింది.

గ్రూప్‌-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. హైకోర్టులో పోరాడిన అభ్యర్థులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసేవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య చిల్లర సమస్యకు చెక్‌ పెట్టేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయింది.

అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది.

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా సామ్రాజ్యం నడుస్తున్నదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు

ఏపీలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఉన్నత విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు పోలీసు కస్టడీ విధించిన మంగళగిరి కోర్టు

గుంటూరు జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్య

ఈనెల 23న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగనుంది.

పల్లె వెలుగు బస్సులో వైఎస్‌ షర్మిల.. మహిళలకు ఫ్రీ బస్‌ కోసం డిమాండ్‌.

NATIONAL NEWS

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు కజాన్‌ లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్‌ సమ్మిట్‌ లో పాల్గొననున్నారు.

బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది.

మనీ లాండరింగ్‌ కేసులో దాదాపు రెండేండ్ల తర్వాత ఆప్‌ నేత, మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.

రాష్ట్ర హోదా కోరుతూ జ‌మ్ముక‌శ్మీర్ మంత్రిమండ‌లి తీర్మానం

రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పని చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988లో చేసిన సవరణలు రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ఉపసంహరించుకుంది.

మణిపూర్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌సింగ్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు.

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ కార్యక్రమాలు వద్దు.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి.. సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు

INTERNATIONAL NEWS

రష్యా సైన్యంలో 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులు చేరేందుకు ఏర్పాట్లు జరిగినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.

హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 7న గాజాలో జరిపిన దాడుల్లో సిన్వర్‌ మరణించినట్టు తాజాగా ప్రకటించింది.

ఆయుధాలను వదులుకొని, బందీలను విడిచిపెట్టేందుకు హమాస్‌ అంగీకరిస్తే రేపే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహ్ శుక్రవారం పేర్కొన్నారు.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 81,225 (218)
నిఫ్టీ : 24,854 (104)

ఈ నెల 11తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు 10.746 బిలియన్‌ డాలర్లు తరిగిపోయి 690.43 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్‌ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.79,900 పలికింది.

కిలో వెండి ఏకంగా రూ. 1,000 అధికమైంది. దీంతో ధర రూ.94,500 పలికింది

SPORTS NEWS

రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకున్న భారత్‌. బ్యాట్స్ మన్ రాణింపే కీలకం.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 46/10
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 402/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 231/3

టెస్టుల్లో ఒక ఏడాదిలో ‘వంద సిక్సర్లు’ కొట్టిన తొలి జ‌ట్టుగా టీమిండియా రికార్డు పుట‌ల్లోకి ఎక్కింది.

పరుగుల యంత్రం కోహ్లీ ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించడంతో టెస్టులలో 9వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సచిన్‌ (15,921), ద్రావిడ్‌ (13,265), గవాస్కర్‌ (10,122) కోహ్లీ కంటే ముందున్నారు.

బ్రిటన్‌లో జరిగిన డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ ట్రోఫీని అర్జున్‌ సొంతం చేసుకున్నాడు.

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ కు న్యూజిలాండ్ చేరింది. సెమీస్ లో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికా తో తలపడనుంది.

సొంతగడ్డపై 11 టెస్టు మ్యాచ్‌ల అనంతరం పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముల్తాన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టును ఆ జట్టు 152 పరుగుల తేడాతో గెలుచుకుంది.

డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

EDUCATION & JOBS UPDATES

TGPSC – షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర సర్వీస్ లలో 457 ఇంజనీరింగ్ ఉద్యోగాలు

23 నుంచి తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్స్

23 నుంచి DEECET వెబ్ ఆప్షన్లు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు