BIKKI NEWS (OCT. 17) : TODAY NEWS IN TELUGU on 17th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th OCTOBER 2024
TELANGANA NEWS
గ్రూప్ 1 నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. గ్రూప్-1 పరీక్షల నిలిపివేతకు నిరాకరించింది
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డి సెంబర్ నుంచి సోమవారం(15వ తేదీ) వరకు రూ.21,881 కోట్లను మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చుచేసింద ని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం నియమితులయ్యారు.
బాసర ట్రిఫుల్ ఐటీ ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్, హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా ధనావత్ సూర్య నియమితులయ్యారు.
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
సొంత క్యాడర్‌కు వెళ్లాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆల్ ఇండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది.
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మూడో నిందితుడు రుద్ర శివకుమార్ ఉదయ్‌సింహ బుధవారం ఈడీ కోర్టు విచారణకు హాజరుకాలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ బుధవారం రెండో రోజూ కొనసాగింది.
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది
తెలంగాణలో 8,490 ఎంబీబీఎస్ సీట్లు.. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత : హరీశ్‌రావు
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల 2025 జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది.
ఏపీలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి 6 కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఏపీలో ఇసుక , మద్యం పాలసీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0 కు, ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి, రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది
NATIONAL NEWS
క్వింటాల్ మద్దతు ధర గోధుమ ధరను రూ.150, ఆవాల ధరను రూ.300, పెసర్ల ధరను రూ.275, శెనగల ధరను రూ.210, పొద్దుతిరుగుడు ధరను రూ.140, బార్లీ ధరను రూ.130 చొప్పున పెంచినట్టు కేంద్రం ప్రకటన.
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది.
ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను తయారుచేసిన భారతీయుడు సెబిన్ సాజి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు.
జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం.
ఉగ్రవాదాన్ని నిర్మూలించకుంటే.. సహకారం కుదరదు: పాకిస్థాన్‌లో మంత్రి జైశంకర్
నీట మునిగిన చెన్నై.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
INTERNATIONAL NEWS
ఉత్తర కొరియా ఆర్మీలో వారంలో 14 లక్షల మంది చేరిక.
ఖల్థిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యపై భారత్‌కు కచ్చితమైన ఆధారాలు అందజేయలేదని అన్నారు.
ఆఫ్రికా దేశం నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
లెబనాన్‌లోని ప్రతి చిన్నారిపై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం.. ఆందోళన వ్యక్తం చేసిన యూనిసెఫ్
BUSINESS NEWS
నష్టాలలో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,501 (-318)
నిఫ్టీ : 24,971 (-86)
భారత్‌కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. చైనా నుంచి భారత్‌కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగా 56.29 బిలియన్ డాలర్లు.
న్యూఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.79 వేలకు చేరువైంది.
SPORTS NEWS
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే చారిత్రక యాషెస్ టెస్టు సిరీస్ వచ్చే ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 8 దాకా ఈ సిరీస్ జరుగనుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం నుంచి మొదలు కావాల్సిన తొలి టెస్టు తొలి రోజు అట పూర్తి గా వర్షం కారణంగా రద్దు.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. నీతూతో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌నూ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుతున్నట్టు ఐసీసీ వెల్లడించింది.
ప్రతిష్ఠాత్మక ఖో-ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలో ఖో ఖో ప్రపంచకప్ జరుగుతుందని నిర్వహకులు పేర్కొన్నారు
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఐసీసీ ఆల్‌టైమ్ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టాప్-20 చోటు దక్కించుకున్నాడు
EDUCATION & JOBS UPDATES
NCERT లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్.
SSC CHSL టైర్ 1 ఫైనల్ కీ విడుదల
CLAT 2025 దరఖాస్తు గడువు 22 వరకు పెంపు
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ దరఖాస్తు గడువు 30 వరకు పెంపు