BIKKI NEWS (OCT. 16) : TODAY NEWS IN TELUGU on 16th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 16th OCTOBER 2024
TELANGANA NEWS
దేశ భద్రతలో రాడార్ స్టేషన్ అత్యంత కీలకమని, దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రంతో పర్యావరణానికి హాని ఉండదని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
హైడ్రా ఇష్టమొచ్చినట్లు కూల్చుడు కుదరదు.. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు
గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది
టీచర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం. ఉదయం వాయిదా ప్రకటన.. మధ్యాహ్నం కొనసాగింపు. ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు.మిగిలిన వారికి నేడు పోస్టింగ్స్
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉద్యోగుల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై రెండో రోజైన మంగళవారం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 33 పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వాహకులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ పాటించారు.
మూసీ వెంబడి రెండో దఫా కూల్చివేతలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రివర్ బెడ్ పరిధిలోని నిర్మాణాలు, కట్టడాలు, భవనాలను నేలమట్టం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఆర్‌డీసీఎల్) రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల అధికారులతో సమన్వయ సమావేశమైంది.
రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించింది.
పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన G.O 81 ప్రకారం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు.
రేవంత్ కోర్టుకు రాకుంటే నిరాహారదీక్ష చేస్తా.. ఓటుకు నోటు కేసు ఏ-4 జెరూసలేం మత్తయ్య హెచ్చరిక
మరో వెయ్యి కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. 74,495 కోట్లకు చేరిన రుణం
ANDHRA PRADESH NEWS
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆస్తులను అటాచ్‌మెంట్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ నేడు సచివాలయంలో జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు.
అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
మద్యం అమ్మకాలపై కాకుండా అదనంగా 2 శాతం డ్రగ్స్ నియంత్రణ సెస్ విధిస్తూ మంగళవారం ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నం బలపడింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తిరుమల లడ్డూ కేసులో సిట్ సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ఠా త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి పేర్లను పంపామని డీజీపీ వెల్లడించారు.
ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే.. 2027లోనే ఎన్నికలు వస్తాయి.. మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు
NATIONAL NEWS
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డంకి కాదని తెలిపింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న రెండు రాష్ర్టాల కౌంటింగ్ ఉంటుంది.
గ్లోబల్ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించండి: ప్రధాని మోదీ
ప్రభుత్వ ఏర్పాటుకు ఎల్జీ ఆహ్వానం.. నేడు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు సైతం శబరిమల అయ్యప్పను సాఫీగా దర్శనం చేసుకోవచ్చునని మంగళవారం ప్రకటించింది.
రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభకు ఉప ఎన్నికను నవంబర్ 13న నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు ఉంటాయని తెలిపింది.
కేదార్‌నాథ్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌ను వణికించిన స్వల్ప భూకంపం
స్వదేశీ ఏఐ సామర్థ్యం, అప్లికేషన్స్ పెంచేందుకు.. స్వదేశీ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఢిల్లీ-చికాగో విమానం కెనడాకు మళ్లింపు..
అమెరికా-భారత్ మధ్య భారీ డిఫెన్స్ డీల్.. రూ.31వేలకోట్లతో ప్రిడేటర్ డ్రోన్స్ కొనుగోలుకు ఒప్పందం..
INTERNATIONAL NEWS
మరోసారి నోరుపారేసుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. భారత్ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపణలు. నిజ్జర్ హత్య కేసు విచారణకు సహకరించడం లేదని వ్యాఖ్య. బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు: కెనడా
భారత్‌పై ఆంక్షలకు సంకేతాలు.
లూనార్ రీసర్చ్ స్పేస్ స్టేషన్ నిర్మించనున్న చైనా
ఇజ్రాయిల్‌కు థాడ్ యాంటీ మిస్సైల్ సిస్టమ్‌ను అప్పగిస్తున్న అమెరికా
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,820 (-153)
నిఫ్టీ : 25,057 (-71)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్‌ఆర్)లో ఒకదాన్ని సవరించింది.
రాబోయే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నదని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు
SPORTS NEWS
ప్రపంచ షూటింగ్ వరల్డ్‌కప్‌లో సోనమ్ ఉత్తమ్ మస్కర్.. సిల్వర్ మెడల్ గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె మెడల్ గెలిచింది.
నేటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు
యువ గ్రాండ్‌మాస్టర్లు విదిత్ గుజరాతి, దివ్య దేశ్‌ముఖ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించింది
రెండ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలంలో సుమారు 250 మంది ఆటగాళ్లు పేర్లు నమోదుచేసుకోగా భారత సారథి హర్మన్‌ప్రీత్ సింగ్ రూ. 78 లక్షల (సూర్మా హాకీ క్లబ్)తో అత్యధిక ధర దక్కించుకున్నాడు.
EDUCATION & JOBS UPDATES
CSIR UGC NET 2024 ఫలితాలు విడుదల
TGPSC యధావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
ఏపీ లో సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ ఉచిత డీఎస్సీ కోచింగ్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గడువు 500/- రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 20 వరకు పెంచుతూ ప్రకటన.