BIKKI NEWS (JAN. 16) : TODAY NEWS IN TELUGU on 16th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 16th JANUARY 2025
TELANGANA NEWS
కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండు రోజుల క్రితం విధివిధానాలు జారీ చేసింది.
ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని అభ్యర్థిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది
తెలంగాణ స్థానికత కలిగి, ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చేసిన ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీ వైద్యవిద్య అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి.
ANDHRA PRADESH NEWS
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.
మోహన్‌బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్‌కు నో ఎంట్రీ
NATIONAL NEWS
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు భారత రాజ్యంతోనూ తమ పార్టీ పోరాడుతున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుఎల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి
గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్‌కు సంఘీభావంగా, తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు బుధవారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ సూరత్, నీలగిరి, వాఘ్‌షీర్
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్
ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
మధురై జిల్లాలో రెండోరోజు సంప్రదాయ జల్లికట్టు క్రీడ.. పోటీపడ్డ యువకులు
కారు కొనాలంటే పార్కింగ్ స్థలం చూపించాల్సిందే.. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్
INTERNATIONAL NEWS
15 నెలల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకారం.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ అరెస్ట్
దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి తక్షణ ముప్పుగా పరిణమించినట్టు ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సెన్సెక్స్ : 76,724.08 (224.45)
నిఫ్టీ : 23,213.20 (37.15)
డిసెంబర్‌లో 2.37 శాతంగా టోకు ధరల ద్రవ్యోల్బణం
SPORTS NEWS
విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి.
గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీల్లో జోకోవిచ్ 430 మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. ఆ జాబితాలో రోజర్ ఫెదరర్ 429 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐర్లాండ్‌పై 3-0 తేడాతో భారత్ మహిళల క్రికెట్ జట్టు సిరీస్ కైవసం.
వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు (పురుషులు, మహిళలు కలిపి) ఇదే అత్యుత్తమ స్కోరు 435/5 సాదించిన మహిళల జట్టు
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ రాష్ట్రం లో 2025 – 26 కు గానూ వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ లో కేటగిరీ 2 లో పీహెచ్డీ అడ్మిషన్స్ 2025 నోటిఫికేషన్ జారీ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 05
- శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ