BIKKI NEWS (NOV. 11) : TODAY NEWS IN TELUGU on 11th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 11th NOVEMBER 2024
TELANGANA NEWS
బీసీల గొంతుకోసిన కాంగ్రెస్.. 42% కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి: కేటీఆర్
తెలంగాణ మహిళల్లో 50 శాతం మందికి రుగ్మత!
డీఈవో పోస్టులు మంజూరు చేయాలి.. పీఆర్టీయూ డిమాండ్
ఇంటింటి సర్వేతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
జహీరాబాద్ హైవేపై భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం
కురుమూర్తి స్వామికి సీఎం రేవంత్ రెడ్డి పూజలు
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం!
ANDHRA PRADESH NEWS
మాయచేసి మభ్య పెడతాడు.. ప్రజలను మోసగిస్తాడు.. ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
శ్రీశైలంలో కార్తీక సందడి.. శివ నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రం
ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ.. రోనాల్డ్ రోస్‌కు కీలక పోస్టింగ్!
నేటి నుంచి 12 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ పేరు ఖరారు
ఎన్నికల హామీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులా ? : మాజీ మంత్రి విడదల రజిని
NATIONAL NEWS
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
జమ్ముకశ్మీరులోని కిష్టార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయం బయట భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని నిరసిస్తూ హిందూ, సిక్కు సంఘాల కార్యకర్తలు ఆదివారం కెనడా హైకమిషన్ కార్యాలయం బయట భారీ నిరసన నిర్వహించారు.
మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు ఆరు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చింది.
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో ప్రధాన షూటర్ శివకుమార్‌ను ఆదివారం ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్‌లో పోలీసులు పట్టుకున్నారు.
INTERNATIONAL NEWS
రష్యా రాజధాని మాస్కోపై ఆదివారం ఉదయం ఉక్రెయిన్ 34 డ్రోన్లతో విరుచుకు పడింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే.
రాజధాని టోక్యో నుంచి ఒసాకా వరకు 515 కిలోమీటర్ల (320 మైళ్లు) మేర సరికొత్త సరుకు రవాణా వ్యవస్థను జపాన్ తీసుకొస్తున్నది. ఇంతకు ముందు ఎక్కడా చూడనటువంటి రీతిలో ఓ ‘ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ కారిడార్’ (కన్వేయర్ బెల్ట్ రోడ్)ను నిర్మించబోతున్నది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన అరిజోనాలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అన్ని స్వింగ్ స్టేట్స్‌నూ ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
మహిళల హక్కుల్ని హరించేలా ఇరాక్ పాలకులు వివాహ చట్టాల్ని సవరించేందుకు సిద్ధమయ్యారు. బాలికల వివాహ వయసును 9 ఏండ్లకు తగ్గిస్తూ అక్కడి సంకీర్ణ సర్కార్ చట్టాల్ని సవరించబోతున్నది.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిజ్జర్ సన్నిహితుడు అర్ష్ డల్లా కెనడాలో అరెస్ట్
BUSINESS NEWS
క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ తొలిసారి 80 వేల డాలర్లకు చేరువలోకి వచ్చి చేరింది.
టాప్ -10లో ఆరింటి ఎం-క్యాప్ రూ.1.55 లక్షల కోట్లు లాస్.. అత్యధికంగా రిలయన్స్‌కు నష్టం..
పాన్ కార్డు దారులంతా డిసెంబర్ 31 లోపు ఆధార్ కార్డులతో అనుసంధానించుకోవాలని ప్రజలను కోరింది.
SPORTS NEWS
రెండో టీట్వంటీ లో దక్షిణాఫ్రికా పై టీమిండియా ఓటమి. సీరీస్ 1-1 తో సమం.
ఆసీస్ గడ్డపై 22 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ వన్డే సిరీస్ నెగ్గింది.
నేటి నుంచి బీహార్‌లో జరుగనున్న హకీ మహిళల ఆసియా కప్ (ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) నకు తెర లేవనుంది.
EDUCATION & JOBS UPDATES
TGPSC – గ్రూప్ 3 హల్ టికెట్లు విడుదల
TGPSC – గ్రూప్ – 4 మూడో, నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి 18 నుంచి మూడవ దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ శివాజీ తెలిపారు.