BIKKI NEWS (FEB. 10) : TODAY NEWS IN TELUGU on 10th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th FEBRUARY 2025
TELANGANA NEWS
గులియన్ బారీ సిండ్రోమ్ (GBS) సోకిన 25 ఏళ్ల మహిళా మరణించారు. తెలంగాణలో ఈ వ్యాధి వలన ఇదే తొలి మరణం.
నేటితో (ఫిబ్రవరి 10) ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు.
కొన్న సన్న వడ్లకు బోనస్ డబ్బులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు
కులగణన ఆశాస్త్రీయంగా జరిగిందని, మళ్లీ రీసర్వే చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ పై దాడి. పోలీసులకు ఫిర్యాదు.
ANDHRA PRADESH NEWS
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.
దక్షిణాది రాష్ట్రాలలో భారీ దొంగతనాలు చేస్తున్న థార్ గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.
మహిళను వేధింపు కేసులో జనసేనకు చెందిన కిరణ్ రాయల్ పై పార్టీ అంతర్గత విచారణ. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం.
పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి.
NATIONAL NEWS
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
చత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్. 31 మంది నక్సల్స్ మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు.
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పెకిలించివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతీశీ రాజీనామా. అసెంబ్లీ రద్దు. త్వరలోనే బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనుంది.
కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. 200 నుండి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.
INTERNATIONAL NEWS
మెక్సికో లజ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మరియు ట్రక్ డీకోనడంతో జరిగిన పెను ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృతి చెందారు.
నమీబియా దేశ పితామహుడు ఆ దేశ తొలి అధ్యక్షుడు సామ్ నుజోమా (95) అనారోగ్య కారణంగా కన్నుమూశారు.
కరేబియన్ సముద్రంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మద్దతుదారులను అణిచివేసేందుకు ఆపరేషన్ డెవిల్స్ హంట్ ను ప్రారంభించిన తాత్కాలిక ప్రభుత్వం.
టైమ్ మ్యాగజైన్ ప్రెసిడెంట్ మస్క్ అంటూ ఒక కవర్ పేజీని ప్రచురించింది.
దేశ అణుశక్తిని మరింత బలోపేతం చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తన అధికారులను ఆదేశించారు.
BUSINESS
విదేశీ ఫోర్ట్ పోలియో (FPI) ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు 7300 కోట్ల రూపాయల పెట్టుబడులను భారత్ నుంచి ఉపసంహరించుకున్నారు.
SPORTS NEWS
రెండో వన్డేలో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా. సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ. 2 – 0 తో వన్డే సిరీస్ కైవసం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. యూపీ వారియర్స్ కెప్టెన్ గా దీప్తి శర్మ పేరు ప్రకటన.
EDUCATION & JOBS UPDATES
అగ్నీవీర్ వాయు (స్పోర్ట్స్) నోటిఫికేషన్ విడుదల. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు గడువు.