BIKKI NEWS : today in history september 7th
today in history september 7th
సంఘటనలు
2017: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి ‘వికీవత్సరం’ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు – 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబరు 7న ‘వికీవత్సరం’ పూర్తిచేశాడు.
జననాలు
1533: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (మ.1603)
1914: జరుక్ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
1925: భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (మ.2005)
1953: మమ్ముట్టి, మలయాళ సినీ నటుడు.
1983: గుత్తా జ్వాల, బాడ్మింటన్ క్రీడాకారిణి.
మరణాలు
1976: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905)
1986: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918)
1990: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (జ.1928)
1991: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాట నాయకుడు. (జ.1908)
2004: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)